7, జూన్ 2019, శుక్రవారం

మ్యాంగో తోట


మ్యాంగో తోట లో థెఫ్ట్ అంటే హ్యాంగ్ చేయకుంటే ఎలా !
హే ! మేకిట్ అఫిషియల్ ! అందుకే పంచాయితీ ఆఫీసులో !
హి డెడ్ నా ! కూల్ బ్రో ! నవ్ లెట్ మీ ఎలౌ టు సే అబౌట్ మ్యాంగో 
మ్యాంగో ఎప్పుడూ రాజఫలం తంబీ ! కూలోళ్ల కాయ కాదు !
ఎప్పుడైనా ఆ కలర్ చూశావా ! పచ్చగా ఎంత మిసమిస లాడుతుంతో !
అది “అగ్ర” తాంబూలం అందుకొనే ఫ్రూట్ యార్ !
కింద రాలింది అంటే ఎంత నష్టం !
కిందకొచ్చింది కదా అని నువ్వుందుకుంటే ఎంత కష్టం !
నువ్వేదే నల్ల నేరుడుకాయ తింటే సరే కానీ !
మ్యాంగో తినేస్తానంటే ఎలా !
ఆశక్కూడా అంతుండాల్రా ఈడియట్ !
కొడితే ఐ బాల్ కూడా పగిలిందని తెగ బాధ పడుతున్నావు !
బతికున్నప్పుడే కన్నెత్తి చూడటానికి లేదు అంటుంటే
కాటికి పోయాక కన్ను లేదని కన్నీళ్ళు పెడతారేంటి !
కాయ మీద కన్ను పడితే కన్నుపీకటం కామన్ థింగ్ .
ఇన్ ఫాక్ట్ ! ఇట్శ్ ఎ రూల్ ! డోంట్ ఫర్గెట్ !
కాయ, చెట్టు, నేల, నీళ్ళు అన్నీ వాళ్లవే అయినప్పుడు,
ఏవీలేకుండా పుట్టటం నీ తప్పే బ్రో ! సో, హ్యాపీగా చచ్చిపో
అయినా నీ చావు మాత్రమ్ కొంచెం కాస్ట్లీనే గురూ !
నాలుగులక్షలు పలికిందంటగా రేటు !
మోర్ ఓవర్ ! వోల్ స్టేట్ నీ గురించే డిస్కషన్
చావులో సంచలనం క్రియేట్ చేశావు ! వెరీ గుడ్
మారాజు పుటుక పుట్టావు అని ఎవరూ నిన్నింకా దీవించలేదా !
పర్లేదు లే ! చావు నలుగురికి తెలిసింది, మోసేందుకూ నలుగురొచ్చారు !
సో, నీ చావు మారాజు చావే ! ఫీల్ ప్రౌడ్ !
ఇక ఇప్పుడు మ్యాంగోస్ అని సేఫ్ !
ఎటొచ్చి నీలాంటోళ్ళకే డేంజర్ ! ఏమంటావు !
బైదివే ఇక ఎవరైనా మ్యాంగోస్ మీద కన్నేస్తారా !
చావు మారాజు లా వెయిట్ చేస్తుంది మరి !
(మామిడి కాయలు దొంగిలించాడన తూగో జిల్లాలో బక్కి శ్రీను అనే ఒక దళితుడుని కొట్టి చంపిన సంఘటన పై నా స్పందన)

30, జులై 2018, సోమవారం

మబ్బులు మింగిన వెన్నెల



 గ్లాస్ లో మరో పెగ్ ఫిక్స్ చేసుకోనీ బాల్కానీ వైపు నడిచాను,  అక్కడ నుండి రాజా సీట్ మీదుగా కొండల్లోకి జారుతున్న సూరీడు చాలా అందంగా కనిపిస్తున్నాడుఅసలు మడికిరి వచ్చే యాత్రీకులు అందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా చూసేదీ ఇదే,మడికిరి  రాజా వారు, ప్రతి రోజు అక్కడ కూర్చునే ప్రకృతి ని ఆస్వాదించేవాడట. రాజు గారు పోయినా ఆ ప్లేస్ కి మాత్రం రాజా సీట్ పేరు స్థిరపడి పోయింది . ఆ సీట్ కి ఎదురుగా ఉన్న చిన్న గెస్ట్ హోస్ , నాకు చాలా ఇష్టమైన ప్రదేశం, మడికిరి  ఎప్పుడు వచ్చినా అక్కడే నా మకాం, అదేమీ పెద్ద హోటల్ కాదు, కేవలం ఒక 10-15 మంది గెస్ట్ లకు మాత్రమే ఆతిధ్యం ఇవ్వగల చిన్న బిల్డింగ్గత 5 సంవత్సరాలుగా నాకు ఆ పరిసరాలు బాగా అలవాటు అయ్యాయి, కనీసం ప్రతి మూడు నెలలోకొకసారి అయినా వచ్చి ఒక వారం రోజులు అక్కడ ఉండి ఆ ప్రకృతి ని అలా ఆస్వాదించటం నా జీవితం లో ఒక భాగం అయిపోయింది .
పడమటి దిక్కున సూరీడు జారుకున్నాక, ఒక్కొక్కరు గా యాత్రీకులు ఆందరూ వెళ్ళిపోయారు, అక్కడక్కడ కొన్ని యువజంటలు మాత్రం కనిపిస్తున్నాయి . మరి కొద్ది సేపు ఆగితే వారు కూడా వెళ్ళీపోతారు . చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, రాజా సీట్ నుండి వెన్నెల రాత్రులు ఇంకా అందంగా కనిపిస్తాయి, కనుచూపు సాగిన మేర పచ్చటి కొండలు తప్ప మరెలాంటి జనావాసాలు కనిపించవు, ఆ కొండల ఆకుపచ్చ రంగు వెన్నెల రంగులద్దుకొని అందమైన అమ్మాయి నవ్వులా కనిపిస్తుంది, అసలు నాకైతే ఆ కొండ వంపు, అచ్చు అమ్మాయి నడుము వంపు లానే కనిపిస్తుంది. దాని మీద పడిన వెన్నెల నడుము మీద పడి మెరుస్తున్న చెమట చుక్కలా ఉంటుంది . నాకు ఆ వంపన్నా, ఆ వెన్నెలన్నా చాలా ఇష్టం .
కానీ ఈ రోజెందుకో నాకు అక్కడ కూర్చోవాలి అనిపించటం లేదు, చాలా అసహనంగా ఉంది.మూడు రోజుల నుండి రాజీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా, ఈ రోజు రాత్రికి ఎలా అయినా వస్తాను అని చెప్పింది, సాయంత్రం 3 కి బెంగుళూరు నుండి కార్ లో  బయలుదేరుతూ ఫోన్ చేసింది,నిక్కీ ని కూడా తీసుకొని వస్తున్నాను అని కూడా చెప్పింది ఈ పాటికే రావాల్సింది , గంటన్నర  నుండి ఫోన్ నాట్ రీఛబుల్ అని వస్తుంది . లాస్ట్ కాల్ కుశాల్ నగర్ లో ఉన్నప్పుడు చేసింది, అక్కడ నుండి మొత్తం ఘాట్ రోడ్, ఒక గంట ప్రయాణం,  గంటన్నర అయినా ఇంకా రాలేదు, వాతావరణం కూడా ప్రశాంతంగానే ఉంది. అయినా ఇంకా ఎందుకు రాలేదు?? రాజీ ఎప్పుడూ ఇంతే, ఏ పనైనా నింపాదిగా చేస్తుంది . దేనికి తొందర పడదు .ప్రశాంతంగా చేస్తుంది . నా కంగారు చూసి నవ్వేస్తుంది . ఒక్కోసారి నాకే అనిపిస్తుంది నేను అనవసరంగా కంగారు పడుతున్నానేమో !

రాజీ కి నాకు పరిచయం విచిత్రంగా జరిగింది, , బెంగుళూరు ఎయిర్ పోర్ట్ స్టార్ట్ అయినా రెండో రోజో, మూడో రోజో సరిగా గుర్తు లేదు, హైదారాబాద్ నుండి బెంగుళూరు ఫ్లైట్ లో నా పక్క సీట్ , బయటకు వచ్చి చూస్తే కాబ్స్ లేవు, అప్పుడు రాజీ నే తన కార్ లో నన్ను హోటల్ వరకు డ్రాప్ చేసింది, అలా మొదలయ్యింది మా పరిచయం, రాజీ ఇన్ఫోసిస్ లో హెచ్‌ఆర్ మేనేజర్ గా చేస్తుంది . USA లో ఉన్న భర్త తో విడిపోయి కూతురు నిక్కి, అమ్మ శారద తో కలిసి బెంగుళూరు లో ఉంటుంది . వాళ్ళ అమ్మ శారద కూడా డాక్టర్ గా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు  విశ్రాంతి తీసుకుంటుంది.
ఎప్పుడూ నవ్వుతూ అసలు దిగులు అంటే తెలియదా అన్నట్లుంటుంది వాళ్ళీంట్లో .  అసలు రాజీ కున్న ధైర్యం ఎవరికీ ఉండదేమో అనిపిస్తుంటుంది . ఏ మాత్రం ఖాళీ దొరికినా కొండల వెంట, జలపాతాల వెంట పరిగెడుతుంటుంది .నిజానికి  ఈ మడికిరి , ఈ ప్రకృతి నాకు పరిచయం అయ్యింది కూడా రాజీ ద్వారానే. అప్పటినుండి ప్రతి మూడు నెలలకు ఒక వారం సెలవు తీసుకొని ఇక్కడకు రావటం అలవాటు చేసుకున్నాబ్యాంక్ జాబ్ లో ఉండే స్ట్రెస్ అంతా ఇక్కడకు రాగానే మంత్రం వేసినట్లు పారిపోతుంటుంది, దానికి తోడు ఆ వారం రాజీ తో గడపటం, రాజితో ఉంటే అసలు మరో ప్రపంచమే గుర్తు రాదు, రాజీ వడిలో పడుకొని ఆ జుట్టు తో ఆడుకోవటం అంటే నాకు చాలా సరదా .సాధారణంగా హెచ్‌ఆర్ మేనేజర్స్ బాబ్ద్ హెయిర్ తో ఉండాలి కదా అంటే,  బ్యాంక్ మేనేజర్స్ కూడా ఎప్పుడూ టై కట్టుకొనే ఉండాలి కదా , అంటూ నవ్వే ఆ చిలిపి నవ్వు అంటే నాకు ఇంకా ఇష్టం . రాజీ నాకు పరిచయం అయినప్పుడు నిక్కీ ఇంకా మొదటి పుట్టిన రోజు కూడా చేసుకోలేదు.
 రాజీ లేకుండా మడీకిరి లో నేనొక్కడినే ఉండటం ఇదే మొదటిసారి, బహుశా అందుకే నాకు మడీకిరి అందంగా కనిపించటం లేదేమో
ఆలోచిస్తుండగానే కార్ ఆగిన శబ్దం వినిపించింది . బహుశా రాజీ వచ్చుంటుంది. మేడ దిగి కిందకు వెళ్ళాను, రాజినే ! కార్ లో నుండి లగేజ్ దించుతూ,  ఎంత అందంగా ఉంటుంది రాజీ, 5.6 ఎత్తు, చామనచాయ రంగు, ఎక్కడ ఎంత ఉండాలో ఖచ్చితంగా కొలత వేసినట్లు ఉండే అవయవ సౌష్టవం, పెదవులపై ఎప్పుడూ చెరగని నవ్వు. నడుములు తాకే నల్లటి జుట్టు. కొన్ని వందల సార్లు చూసి ఉంటాను, కానీ ఎప్పటికీ ఆకర్షణీయంగానే కనిపిస్తుంది
“ఏరా ! వేయిట్ చేయించానా ! సారీ రా !” నవ్వుతూ చెప్పింది
లగేజ్ అందుకొని పైకి తీసుకువెళ్లాను,
అవును ! నిక్కీ ఏదీ “ అడిగాను
“కుశాల్ నగర్ లో మా బంధువులు ఉంటే వారింట్లో ఉంది”
“కుశాల్ నగర్ లో బంధువులా !! ఎప్పుడూ చెప్పలేదే , మనం ఎప్పుడూ వెళ్లలేదే “ అనుమానం వెలిబుచ్చాను
“హ హ హ ! మనం వెళ్ళటమా ! ఏమని వెళ్దామురా ! నా బాయ్ ఫ్రెండ్ , హైదారాబాద్ నుండి మూడు నెలలకోసారి వచ్చి, నాతో వారం గడిపేసి వెళ్తుంటాడు, , బట్ ఏ రియల్ జంటిల్మెన్, రొమాంటిక్  కూడా , అని చెప్పమంటావా “ కన్ను కొడుతూ అడిగింది .
రాజీ తీరే అంత, చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది . ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది
“ఏరా ! ప్రవరాఖ్యా ! నన్ను ముట్టుకోవాలి అని కూడా అనిపించటం లేదా ! “ అంటూ సీరియస్ గా అడిగిన ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను .
సరే ! సరే ! కానివ్వు, ఇప్పటికీ సగం రాత్రి వేస్ట్ అయిపోయింది ...... పద ! వెన్నల్లో వ్యాహ్యాళి కెళ్దాం” అంటూ బయల్దేర దీసింది.

నేను రాజీ ని మౌనంగా అనుసరించాను
ఈసారి డ్రైవింగ్ సీట్లో నేను కూర్చోన్నాను, అలా  అబ్బీ ఫాల్స్ వరకు వెళ్ళి, వెన్నెల్లో ఆ జలపాతాన్ని చూడటం రాజీకి చాలా ఇష్టం
“ఇప్పుడు చెప్పు రాజీ ! మూడు రోజుల నుండి ఎందుకు రాలేదు ! నేనిక్కడ నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా “
“ఆ మాత్రం విరహం ఉండాలోయ్ ! లేదంటే బోర్ కొట్టేయదూ ! “ ఎప్పటిలాగే చెప్పింది
కలిసేదే ! మూడు నెలలకోసారి , మరి అది విరహం కాదా ! “ ఎదురు ప్రశ్న వేశాను
“అది విరహం కాదు, ఉద్యోగ ధర్మం పాటించాలి “
పోనీ ! నువ్వు హైదరబాద్ వచ్చేయి ,అప్పుడు విరహం ఉండదు “
“ అంత లేదు కానీ ! ముందుచూసి నడుపు, లేదంటే ఇద్దరం ఎక్కడికో వెళ్తాం”
ఎప్పుడు ఈ ప్రస్తావన తీసుకువచ్చినా రాజీ ఇలాగే దాటవేస్తుంది, అప్పటికీ ఒకటి రెండు సార్లు అడిగాను, పోనీ నేను బెంగుళూరు రానా ! అని , అప్పుడు కూడా ఇలాగే దాటవేసింది,
నాతో కలిసి ఉండటం రాజీ కి ఇష్టం లేదా !! నాకు ఈ విషయంలో రాజీ అర్ధం కాదు ,ఎప్పుడు ప్రస్తావించినా ఆ విషయాన్ని దాటేస్తుంది తప్ప సరైన సమాధానం ఇవ్వదు. అసలు నన్ను రాజీ ఇష్టపడుతుందా ! లేదా ! నేను కాక రాజీకి ఇంకా ఎవరైనా నాలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా !  అయినా రాజీ అలాంటిది కాదు, నా మనసు ఎందుకు ఇలా ఆలోచిస్తుంది, రాజీ చాలా మంచిది, నన్ను ఇష్టపడుతుంది మరి ఎందుకు ఇలా ! ఆమె లైఫ్ లో నేనొక్కడినే ఉన్నానా !! అనుకుంటా !! కానీ .. బహుశా నిక్కీ తో కలిసి నాతో ఉండటం ఆమెకు కంఫర్ట్ గా ఉండదేమో ! కానీ నిక్కి కూడా నాతో క్లోజ్ గాఏ ఉంటుందే ! నేను కూడా ఎప్పుడు నిక్కీని కలిసినా , చాక్లెట్స్, బొమ్మలు ఇస్తూనే ఉంటానే ! మరి సమస్య ఏముంది ? ఈ విషయం అడుగుదామని చాలా సార్లు అనుకున్నా , కానీ నాకు బాగా గుర్తుంది, పరిచయం అయిన కొత్తలో , భర్తతో ఎందుకు విడిపోయిందో  అడిగితే  నా వ్యక్తిగత విషయాలలో ఎవరి జోక్యం ఎక్కువగా ఉండటాన్ని నేను ఇష్టపడను అని చెప్పటం గుర్తుంది, అందుకే ధైర్యం చెయ్యలేకపోతున్నాను,తరచి అడిగితే మా మధ్య ఉన్న బందం తెగిపోతుందేమో అనే భయం అయితే నాకు ఉంది , ఆమె కూడా అంతే నా వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ అడగలేదు, నేను చెప్పలేదు , కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి, రాజీకి నాకు మధ్య ఒక గోడ ఉన్న అనుభూతి,కానీ ఆమె పక్కనున్నపుడు అవేవీ గుర్తు రావు . ఆమె నేను అంతే !
కానీ ఈరోజు అడగక తప్పదు, కలిసి ఉండాలా ! వద్దా ! అనేది నేను ఇక నిర్ణయించుకోక తప్పదు, రాజీ నాకు స్వంతం అవ్వాలి.  నాకే స్వంతం కావాలి.,
అభిఫాల్స్ దగ్గరకు వచ్చాము, ఫాల్స్ కు దారి తీసే స్టేప్స్ వరకు కార్ వెళ్ళే అవకాశం ఉన్నా, మెయిన్ రోడ్ నుండి కొంచెం వారగా కార్ ఆపి నడుచుకుంటూ వెళ్ళటం రాజీ కి చాలా ఇష్టం, ఆమె నడుము చుట్టూ చెయ్యివేసి అలా నడవటం నాకూ ఇష్టం . కార్ దిగి మౌనంగా నడుచుకుంటూ అభీఫాల్స్ వైపు వెళ్తుంటే ,క్రమక్రమంగా జలపాత హోరు చేవ్వుల్లో వినిపిస్తూ ఉంది.  వెన్నెల కిరణాలు ఆ నీళ్ళ మీద పడి అందంగా మెరుస్తున్నాయి,  కొన్ని నీటి తుంపరలు రాజీ ముఖం మీద చిందాయి, పల్చటి పెదవులపై పడి మరింత అందంగా కనిపిస్తున్నాయి,  నా మనసులో భావాలు రాజీ కి అర్ధం అయినట్లున్నాయి ,  చేత్తో ముఖం తుడుచుకొని
“ఓయ్ ! చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ “ నవ్వింది రాజీ
ఒకసారి ఆ పెదవులపై నా చూపుడు వేలుతో మృదువుగా తాకాను . నవ్వి నా భుజం మీద వాలి పోయింది రాజీ
మరో అరగంట గడిచింది, దాదాపు పది కావస్తుంది .
“ఇక వెళ్దామా ! “ నేనే అడిగాను
నా వైపు వింతగా చూసి
“సరే ! పద “ అంటూ బయల్దేరింది
కార్ ని ఎప్పటిలా రాజా సీట్ వైపు కాకుండా నేరుగా గెస్ట్ హోస్ దగ్గరకే తీసుకెళ్ళాను
“ఏంటి వెన్నెల చూడాలని లేదా !!” అడిగింది కూల్ గా
“లేదు నీతో మాట్లాడాలి !! “ఖచ్చితంగా చెప్పాను
ఈజ్ !ఎనీ థింగ్ సీరియస్ “ ఈ సారి గొంతులో సిన్సియారిటీ
సమాధానం చెప్పకుండా రూమ్ లోకి వచ్చాను
బహుశా నా సీరియస్ నెస్ అర్ధం అయ్యిందేమో రాజీ కూడా ఏమి మాట్లాడలేదు
ఐ షుడ్ బ్రేక్ ద ఐస్. నేనే మాట్లాడాలి. రాజీ ఉద్దేశ్యం తెలుసుకోవాలి
సంభాషణ ఎలా స్టార్ట్ చెయ్యాలొ అర్ధం కావటం లేదు
“ రాజీ !!  యు వాన్నా డ్రింక్ “ అడిగాను
నాకు తెలుసు, రాజీ కి వోడ్కావిత్ ఆరెంజ్ జ్యూస్ అంటే ఇష్టం
“హా !! విల్ ఫిక్స్ ఇట్ “ రాజీ నే ఫ్రిడ్జ్ లోనుండి జ్యూస్ తీసి, టేబుల్ మీదున్న వోడ్కాతో కలిపిఇఛ్చింది
ఆ విషయం మాట్లాదమని ఎంత ప్రయత్నించినా ఎందుకో ఆగిపోతున్నాను
రాజీ తిరస్కరిస్తుంది అన్న భయమా !! నేనంటే ఇష్టం లేదా !!  మరో బాయ్ ఫ్రెండ్  ఉండే ఉంటాడు  !!ఎవరై ఉంటారు  !! అలాంటిది కాదే !! కాదు అని ఎలా అనుకోవాలి. ఎప్పుడూ నేను కనీసం తన ఫోన్ కూడా ముట్టుకోలేదు. ఊ...ఊ కాదు, ముట్టుకోనివ్వలేదు. నాకు తెలియని రహస్యాలున్నాయా !! అసలు నాకు తెలిసిన రహస్యాలేమున్నాయి !! ఏమో నాకే తెలియదు..
ఓయ్ !! హైద్రాబాద్ !! ఏంటీ ! తెగ ఆలోచిస్తున్నావ్ !! ఫుడ్ ఆర్దర్ చెయ్యవా! మరో పది నిమిషాలాగితే పస్తు పడుకోవాలి “   కుదిపేస్తూ అడిగింది
“సారీ !! అయినా ఇక్కడేముంటాయి ఎప్పుడూ ఉండేదేగా ! అదే చెప్తాను”. ఇక్కడ కడుంబుట్టు అని  బాయిల్డ్ రైస్ తో చేసే పెద్ద ముద్ద ,దానితో పాటు బాంబూ షూట్ కర్రీ. లేత వెదురు తో చేసే కర్రీ చాలా బాగుంటుంది. అదే అర్డర్ చేశాను. దానితో పాటే చికెన్ . కాష్యూస్
“రాజీ !! నేను బెంగుళూరు కి షిఫ్ట్ అవుదామనుకుంటున్నాను”  గట్టిగా చెప్పాననే అనుకుంటాను
ఒక నిమిషం మౌనం
“ అదేంటీ స్టేట్ విడిపోతే వైజాగో, విజయవాడో, అమరావతో వెళ్ళాలి కానీ, బెంగుళూరు ఏంటి “ నవ్వుతూ అడిగింది
“ప్లీజ్ బీ సీరియస్ !! నేను బెంగుళూరు వద్దామని డిసైడ్ అయ్యాను” కొంచెం కోపంగానే చెప్పాను
“ఓకే !! కూల్ కూల్ !! సడన్ గా ఎందుకు “ రాజీ ప్రశ్న
“నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను, నువ్వు హైదరాబాద్ రావు, అందుకే నేనే బెంగుళూరు వద్దామని డిసైడ్ అయ్యాను “
“అంటే నా కోసం షిఫ్ట్ అవుతున్నావా “
“అవును”
“బెంగుళూరు వచ్చినా నన్ను రోజూ చూడటం ఎలా వీలవుతుంది అనుకున్నావ్ !! “ కళ్లల్లో ఎలాంటి భావం లేకుండా నా వైపు చూస్తూ అడిగింది
ఈ ప్రశ్న నేను అస్సలు ఊహించలేదు. అందుకే వెంటనే నాకు సమాధానం దొరకలేదు
“అదేంటి !! ఇద్దరం ఒక చోట ఉన్నప్పుడు రోజూ కలుస్తాం కదా !! ఇన్ ఫాక్ట్ ఇద్దరం కలిసి ఉండొచ్చు” ఏదో చెప్పాను, ఐ నో, ! ఇది సరైన సమాధానం కాదు. నిజానికి రోజూ కలుద్దామనే అనుకున్నాను కానీ కలిసి ఉండాలని అనే ప్లాన్ నాకూ లేదు.
‘ఆర్యూ సీరియస్ !”
“హా. యామ్ “  నా గొంతు బలహీనంగా నాకే వినపడింది. రాజీకి మాత్రం బలంగా వినిపిస్తుందా
“ సో !  యూ మీన్ ,అర్ యూ గోయింగ్ టూ మ్యారీ మీ “
ఇప్పుడు నేను షాక్ తిన్నాను
పెళ్లా ! అది రాజీతోనా !! నేను అసలు ఆ విషయమే ఆలోచించలేదు. కలిసి ఉందామనే ఆలోచనే కానీ పెళ్ళి చేసుకొనే ఆలోచన నాకు లేదు. అల్ట్రా మోడర్న్ గా ఉండే రాజీ పెళ్ళి అనే పదం తీసుకువస్తుంది అనుకోలేదు.
“ ఐ మీన్ !! పెళ్ళి అని కాదు.. బట్ వియ్ కెన్ ..”
నవ్వింది.. గట్టిగా నవ్వింది .చాలాసేపు నవ్వింది
“ లీవిట్ ...అదేమీ వద్దు కానీ.. రిలాక్స్ ! నువ్వు నువ్వే, నేను నేనే ! ఇలాగే ఉందాం” చాలా స్థిరంగా చెప్పింది
“ అంటే నాతో కల్సి ఉండటం ఇష్టం లేదా “ ఈ సారి నేను కూడా స్పష్టంగానే అడిగాను, బహుశా రిజెక్ట్ చేసిందన్న ఉక్రొషం కావచ్చు.
“ కలిసి ఉండటమంటే !!”
అవును ! కలిసి ఉండటమంటే ! కలిసి బెడ్ షేర్ చేసుకోవటమా ! కలిసి వర్క్ షేర్ చేసుకోవటమా !! ఇంకేదైనా ఉందా !! ఏమో
“ కలిసి ఉండటమంటే ఒకరికొకరం ఉండటం, ఒకరి ఎదురుగా ఒకరు ఉండటం  ఏవైనా షేర్ చేసుకోవటం “
“ఇప్పుడు అదే చేస్తున్నాంగా !”
అవును అసలు ఇప్పటివరకు ఏమి షేర్ చేసుకున్నాం. మహా అయితే రాజీ వాళ్ళింటికెళ్ళినప్పుడు నిక్కీకి చాక్లెట్లు, హొటల్ కి వచ్చినప్పుడు బిల్స్ , ఇవన్నీ షేర్ చేసుకున్నాం , ఇప్పుడు కొత్తగా ఏమి షేర్ చేసుకోవాలి, డోంట్ నో ! మే బీ హోస్ రెంట్ !! అది కూడా ఎవరి ఫ్లాట్ వాళ్లు అని కదా అనుకుంది . అసలు రాజీ ఏమి ఆలోచిస్తుంది,. నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటుందా !! అసలు నాకు ఆమె గురించి ఏమి తెలుసు అని పెళ్ళి చేసుకోవాలి !! అర్దం కావటం లేదు
“ నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా !!” ఈ సారి నేనే అడిగాను
“ నేనెప్పుడు అన్నాను ! నువ్వు కదా అన్నావు” 
నిజమే ! నేనే కదా కలిసుందామన్నాను.
“అది కాదు రాజీ ! నువ్వంటే నాకు చాలా ఇష్టం ! అందుకే నీతో కలిసుండాలని ఉంది” కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను
దగ్గరకు వచ్చి, నా నుదుటి మీద ముద్దు పెట్టింది
“ ఐ టూ లవ్ యూ రా !! ఈ టాపిక్ ఇంతటితో వదిలేయ్ ! ప్లీజ్ “  కళ్ళ నిండా ప్రేమ నాకు తెలుస్తూనే ఉంది
“ప్లీజ్ ! నాకు ఈ ఒక్క విషయం చెప్పు ! నాతో కలిసి ఉండటం ఇష్టం లేదా ..” నా గొంతులో కొంచెం అధికారం
బెడ్ దిగి టేబుల్ వైపు నడిచింది,,
“ నీతో కలిసి ఉండటం ఇష్టం ఉందా లేదా అనేదానికనా ముఖ్యమెంది మరొకటుంది, అసలు ఎందుకుండాలి అనేది !! ప్రేమతోనా !! మనిద్దరి మధ్య ప్రేముంది అనుకుంటే అది ఉంది. ఉంటూనే ఉంటుంది, దానికి మనిద్దరం కలిసుండాల్సిన పని లేదు. పోనీ మన మధ్య ఎఫైర్ అంటావా  అది ఇప్పుడు కూడా ఉంది, మహా అయితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది .అది కూడా ఖచ్చితంగా చెప్పలేము. నీ వర్క్ టెన్షన్స్, నా వర్క్ టెన్షన్స్ ప్రతిరోజూ ఉంటాయి. సో కాంట్ అష్యూర్ దట్ టూ. అప్పుడు కూడా నెలకొకసారో, రెండు నెలలకోసారో ఇలాగే వెకెషన్ కి వచ్చాకే ప్రశాంతంగా ఎంజాయ్ చేయగలం. నిజానికి నీకు నాతో కలిసి ఉండాలి అనిపించటానికి రీజన్ ఇవన్నీ కాదు. నేను నీ దగ్గర నుండి దూరమైపోతానేమో అనే నీ టెన్షన్. నీతోనే ఉంటే నీకు నా మీద నమ్మకం. అంటే నాకు మరో బాయ్ ఫ్రెండ్ లేడు అని  నీకు నువ్వుగా నిర్దారించుకోవాలనుకుంటున్నావా !. ఐనో !! నన్ను పెళ్ళి చేసుకొనే ఉద్దేశ్యం నీకు లేదు ఆఫ్ కోర్స్ ,నాక్కూడా లేదు. ఇద్దరం కలిశాం, ఒకరికొకరం నచ్చాం. ఇలా కొనసాగుతున్నాం. ఇందులో తప్పొప్పుల గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నువ్వూ ఆలోచించలేదు. ఇప్పుడు నీలో ఒక ఇన్ సెక్యూరిటీ పెరిగింది. ఒక అమ్మాయి నాతో బెడ్ షేర్ చేసుకుంది అంటే మరొకరితో ఎందుకు చేసుకోదు అన్న ఆలోచన  బహుశా నీలో వచ్చిందేమో ,. అందుకే నన్ను నీతో కలిసి ఉండమంటున్నావా ! డోంట్ నో !!.. నీకు నా మీద ప్రేమ ఉంది. నిజమే. కానీ, క్రమంగా ప్రేమ స్థానంలోకి  అధికారం రావొచ్చు, ఇప్పుడు మనం కలిసుండటం ప్రారంభిస్తే క్రమంగా నీలో ఆ అధికారం ఎక్కువ అవుతుంది, ప్రేమ తగ్గుతుంది, నాకు కావాల్సింది ప్రేమ. ఒక అన్ కండిషనల్ లవ్. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నాకు కావాల్సింది కాదు, నేను ఇవ్వాల్సింది కూడా అలాంటి ప్రేమనే.. నేను ఇవ్వటానికి సిద్దంగా ఉన్నాను. నువ్వు తీసుకోవటానికి సిద్దంగా ఉన్నావో లేదో నువ్వే నిర్ణయంచుకో. “  కళ్ళల్లోకి  సూటిగా చూస్తూ  చెపుతోంది.
నిజంగానే నేను ఆమె మీద అనుమానంతోనే ఆమెతో కలిసి ఉండాలనుకుంటున్నానా !! కాదు అనటానికి నా దగ్గర ఎలాంటి కారణాలు లేవు . ఇంతకీ ఆమె కి మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా !! డోంట్ నో ! నా అనుమానం మాత్రం తీరలేదు. షి ఈజ్ టూ ఇంటలిజెంట్.  ఈ అమ్మాయిలు అస్సలు బయట పడరు .మరో పెగ్ ఫిక్స్ చేసుకోని బాల్కనీ వైపు నడిచాను. వాతావరణంలో ఏదో మార్పు వెన్నల చుట్టూ నల్లటి మబ్బులు కమ్ముకుంటున్నాయి. బహుశా వర్షం పడుతుందేమో !!

19, జూన్ 2018, మంగళవారం

డూ ఇట్ ఇన్ డార్క్


మనసు ఒక  పాథోస్ పైథాన్ ని మింగేసినట్లుంది
అస్సలు జీవం లేక కార్ప్స్ లా పడుకొనుంది
స్వాలో చేసే టైమ్ లో తెలియలేదు,
మింగేసిందంతా ఒక పాయిజనస్ ఎక్స్ పీరియన్స్ అని.
ఇప్పుడు చేసేదేమీ లేదు, ఏ చెట్టుకో చుట్ట చుట్టుకొని
పడుకోవాల్సిందే , బాధంతా డైజెస్ట్ చేసుకోవాల్సిందే
లుంగలు లుంగలు తిరుగుతున్న బాధను
కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిందే
షోల్డర్స్ కోసం అస్సలు చూడకూడదు
ఓదార్చే పేరుతో ఏమార్చేస్తారు
ఇన్ ఫాక్ట్ కూల్చేస్తారు కూడా.
సింపుల్ గా పెయిన్ ని మెమరీ అరల్లో
భధ్రపరచి, తిరిగి మరో పరుగుపందెం కోసం
వార్మ్ అప్ కావాల్సిందే.
లైఫ్ రివాల్వ్స్  ఎరౌండ్ పెయిన్
అనే తత్వం,
 ఆ రివాల్వింగ్ ఆర్బిట్  ఎమోషన్
 అనే సత్యం ,
తెలుసుకుంటే చాలు,
 జీవితం పరిగెడుతూనే ఉంటుంది
మన తో పనిలేకుండా.
సో రిలాక్స్,   బాస్
ఈ అనుభవాన్ని
తనివితీరా అనుభవించేయ్  !
బట్, రిమెంబర్, డూ ఇట్ ఇన్ డార్క్
వరల్డ్ నెవ్వర్ వాంట్శ్ యువర్ టియర్స్


10, మే 2018, గురువారం

మహానటులు


ఆ కళ్ళల్లో నీళ్లన్నీ ప్రొజెక్టర్ రీళ్లలా తిరుగుతూ
తెరమీద రంగురంగుల దృశ్యాలు ఆవిష్కరిస్తాయి.
కరతాళ ధ్వనులు, ప్రొడ్యూసర్లకు కాసులు కురిపిస్తాయి
ట్రాజెడీ ఏంటంటే బాక్స్ మూతేసి, థియేటర్ మూసేశాక
ఫిల్మ్ రీళ్ళన్నీ చీకట్లో మగ్గాల్సిందే .
రిమెంబర్ యార్ !! ఎ.సి థియేటర్ల చల్లదనం ఆడియన్సు కి మాత్రమే !
విసిరేసిన బాక్సులకు డార్క్ నెస్స్,
 చింపేసిన టిక్కెట్ ముక్కలకు డస్ట్ బిన్నులే ఆవాసాలు.
లుక్ బ్రో ! ఈ మాయాబజార్ సెట్టింగులన్నీ మిమ్మల్ని రంజింపజేయటానికే !
 సెట్ చేసుకోవాల్సిన రియల్ లైఫ్ లో టియర్స్ కి, గ్లిజరిన్ అవసరం లేదు
“మీ కోసమే మే జీవించునది..... “ అంటూ రెండు చుక్కల ఆనందభాష్పాలతో
మీకో తాత్కాలిక దుఃఖపు తెరని అందించి, 
దాని కోసం ఆ దుఃఖాన్ని శాశ్వతత్వం చేసుకున్న జీవితాలు ఉంటాయి బ్రో !      
ఇది ఆడియన్స్, ప్రొడ్యూసర్స్ అడుకొనే క్యాట్ అండ్ మౌస్ గేమ్ భయ్యా !
క్యాట్ కోసం మౌస్, మౌస్ కోసం క్యాట్ చూపించే ఎర మాత్రం యాక్టరే అనేదే ఫాక్ట్ !
ఆ ఎరలకోసం వేసే , ట్రాపు ట్రాపుకు మధ్య ఉన్న గ్యాప్ లో,
లైఫ్ ని న్యాక్ గా నడపటమే అసలైన నటన.
టేక్ మై వర్డ్,  అది తెరమీద కన్పించినంత ఈజీ కాదు
డోంట్ ఫర్గెట్ డియర్ ! స్క్రీన్ మీద కన్పించేది కేవలం టుడీ నే,
 ఎప్పటికీ కన్పించని దర్డ్ డైమన్షన్ లోతులు తెర మీదకు రావు
బట్,  అక్కడ కొన్ని తారలు ఆకాశంలో రాలుతూ ఉంటాయి
అవే నక్షత్రాలని వెలుగుపూలు అని మీరు భ్రమిస్తుంటారు
కానీ అవి కృష్ణబిలాలు, శూన్యం తప్ప ఏమి మిగిల్చుకోలేవు