14, మార్చి 2015, శనివారం

వాస్తు సౌధం

ఓ విశ్వబ్రహ్మా, !
పరికించితివా మీకే విద్య
నేర్పగల మా చక్రవర్తులు
పరిజ్ఞానం !
ఆయన చిత్తమందు మొలకెత్తిన
సరికొత్త సౌధాల సముదాయం
అస్త్ర, శస్త్ర, వాస్తు శాస్త్ర అభేధ్యం.
అమోఘం, ఆచంచలం
అనిర్వచనీయం
అతులితబలాధామామం
ఆధిపత్యం సైపని ఆతని అంతరంగం
నిర్లిప్తం, నిర్వికారం, నిదానం,
నిరంతర ఆతని  ధ్యానం
దాసోహం, దాసీ జనం
మహాభజనం కావిస్తూ  జీవనమీడ్చు  
ఈ మహా  సమాజం
విదారకం అతని  విధానం
వితావితం అతడి  నిర్ణయం
విగాహం అతడి  ఆనందం
వితధం అతని  పధం
ఆతని అనుంగు మిత్రుడు,
మాయా మయునికైనా చెప్పవా,
ఆతని సౌధాల క్రీనీడల చాటున
నలుగుతున్న కొద్ది మంది బుద్ది
ఆవేశపూరిత ఆవేదనాఆక్రంద కథనం !
ఆ విదగ్దుని క్రియాప్రక్రియలు
మర్మరెరుగలేని అమాయక
బుద్ది జీవుల సమూహం
ఛాతీ విరుచుకొని తిరుగుచున్నదని
ఆగ్రహం చెంది అటులే వారిని  కానలకు
తరలిచు ప్రక్రియను కొన్ని వత్సరములు
అయినను వాయిదా వేయమని ,

ఆతని  ఆధిక్యము , ఆధిపత్యం
అభిజాత్యం,  అన్నిటినీ
అవశ్యం వారునూ
అంగీకరింతురు!
ఆ అభినవ చక్రవర్తుల మానసమెరిగి
వారిని ఉల్లాసమొనరింప
తమ ఉదరములను ,అందు చైతన్యమును
నేటితో సమాధి చేతురు
ఆ సమాధుల పునాదులందు
చక్రవరుల కలల సౌధాలు

వికసించునిమ్ము

 విదారకం = splitting
వితావితం = perfectly useless
విగాహం = excessive /abnormal thirst
వితధం = false /untrue
విదగ్ధా = a skillful

A man kind and A cage

చీకటి విసిరేసిన ఆకాశం
వెలుగుతూ ఆరుతున్న చుక్కలు 
డ్రైనేజ్ లో పారుతున్న పారేసిన పువ్వులు
వాహనం లో నుండి రోడ్ మీద పడ్డ ఒక ఆర్తనాదం
గర్భాశయం గదులు దాటి ముందుకు వెళ్ళే మృగత్వం
జననం ఎక్కడో అక్కడనుండే మరణానికి తరలింపు
అక్కడే అన్నీ ఆంగాల లైవ్ అనాటమీ
A co eternal bliss of all mankind
********
రెక్కలు ముడిచిన పిట్టల కూతల రాగం
జనారణ్య, మృగారణ్య సంధి క్షణం
సాయం సంధ్యా సమయ వర్ణ శోభితం
రుధిరం తాగేసిన సూరీడు కి వీడ్కోలు ఉత్సవం
తధాగతుడు చేతి వెనుక దాక్కున చిక్కటి చీకటి
నేక్లస్ రోడ్ మీద కాండీల్స్ మార్చ్ .
కాలిన మైనం చేతికంటకుండా ప్రికాషన్
కాండిల్స్ పట్టుకున్న వేళ్ళకున్న పింక్ నైల్ పాలిష్
U know it’s too lead by a man
*********
బద్దకంగా ఆవులిస్తున్న సుప్రభాతం
మేడ మీదకు విసిరేయబడ్డ ఒక వార్త
దానికన్నా ముందే మేల్కోన్న పక్షులు
ఇంకా నిద్ర వదల్చుకోని వృక్షాలు,
కాఫీని పరిచి తాగుతున్న వైనం .
పెదవి చివర ఒక వంకర నవ్వు
అన్నిటికి కారణం “అర్ధ నగ్నం”
ఆచ్ఛాదన లేని ఛాతీ తోనే
పట్టిన మురికిని కడుక్కోనే ప్రయత్నం
Now its your turn my bird
Leave this wood cage
He never allows “U” Turn