రండి బాబూ రండి
భలే మంచి చౌక బేరము
ఇది సమయమ్ మించినన్ దొరకదు
త్వరంగొనుడు సుజనులారా
భలే మంచి చౌక బేరం
మళ్ళీ ఐదేళ్లకి కాని రాదీ బేరం
అందుకే వేస్తున్నాం వేలం
పాడుకోండి నాయక జనులారా
కొనుక్కోండి సర్పంచ్ పదవిని
ఏలుకోండీ మమ్మల్ని
పోగేసుకొండి నిదుల్ని
పల్లెటూళ్ళు దేశానికి పట్టుగొమ్మలు
అందుకే తూకానికి వేస్తున్నాం
పట్టుచీరల కోసం
తులసి అకులకు మత్తు లేదు
అందుకే గంజాయు ఆకులకోసం
తులాభారం తూస్తున్నాం
ఎవరు ఎక్కువ తూగితే వాళ్ళకే పదవి
బరువు తూగితే పెద్ద పదవి
తాగి తూగితే చిన్న పదవి
డబ్బులు పంచేవారికి పదవులున్నాయి
డబ్బులు పుచ్చుకొనేవారికి ఓట్లున్నాయి
ఎవరికి కావాల్సింది వారికందుతూనే ఉంది
సగం పదవులు మహిళలకట
పూర్తి అధికారం మాత్రం మొగుళ్లకే కదా
బీసి లకు, యస్.సి లకు యస్,టి లకు
అందరికి పదవులున్నాయి, కాని
పదవంటేనే తెలియదు, సంతకం ముగ్గు తప్ప
గీసే సంతకాలు గీస్తున్నారు
వచ్చే నిదులు వస్తున్నాయి
పల్లె మాత్రం కదలకుండా పడుకొనే ఉంది
అరవై ఐదు ఏళ్ళుగా.
అందుకే కొత్త రక్తం తాగటం కోసం
వేలం వేస్తున్నాం
ప్రతి సంవత్సరం గణపతి చేతి లడ్డు
ఐదు సంవత్సారాలు మీ చేతికి లడ్డు
లడ్డు తీసుకోండి, మీ పొలాల్లో
ఇంట్లో అన్ని చోట్లా చల్లుకోండి
ఇక మీకంతా అభివృద్దే
అందుకే రండి బాబూ రండి
భలే మంచి చౌక బేరము
ఇది సమయమ్ మించినన్ దొరకదు
త్వరంగొనుడు సుజనులారా
భలే మంచి చౌక బేరం
భలే మంచి చౌక బేరము
ఇది సమయమ్ మించినన్ దొరకదు
త్వరంగొనుడు సుజనులారా
భలే మంచి చౌక బేరం
మళ్ళీ ఐదేళ్లకి కాని రాదీ బేరం
అందుకే వేస్తున్నాం వేలం
పాడుకోండి నాయక జనులారా
కొనుక్కోండి సర్పంచ్ పదవిని
ఏలుకోండీ మమ్మల్ని
పోగేసుకొండి నిదుల్ని
పల్లెటూళ్ళు దేశానికి పట్టుగొమ్మలు
అందుకే తూకానికి వేస్తున్నాం
పట్టుచీరల కోసం
తులసి అకులకు మత్తు లేదు
అందుకే గంజాయు ఆకులకోసం
తులాభారం తూస్తున్నాం
ఎవరు ఎక్కువ తూగితే వాళ్ళకే పదవి
బరువు తూగితే పెద్ద పదవి
తాగి తూగితే చిన్న పదవి
డబ్బులు పంచేవారికి పదవులున్నాయి
డబ్బులు పుచ్చుకొనేవారికి ఓట్లున్నాయి
ఎవరికి కావాల్సింది వారికందుతూనే ఉంది
సగం పదవులు మహిళలకట
పూర్తి అధికారం మాత్రం మొగుళ్లకే కదా
బీసి లకు, యస్.సి లకు యస్,టి లకు
అందరికి పదవులున్నాయి, కాని
పదవంటేనే తెలియదు, సంతకం ముగ్గు తప్ప
గీసే సంతకాలు గీస్తున్నారు
వచ్చే నిదులు వస్తున్నాయి
పల్లె మాత్రం కదలకుండా పడుకొనే ఉంది
అరవై ఐదు ఏళ్ళుగా.
అందుకే కొత్త రక్తం తాగటం కోసం
వేలం వేస్తున్నాం
ప్రతి సంవత్సరం గణపతి చేతి లడ్డు
ఐదు సంవత్సారాలు మీ చేతికి లడ్డు
లడ్డు తీసుకోండి, మీ పొలాల్లో
ఇంట్లో అన్ని చోట్లా చల్లుకోండి
ఇక మీకంతా అభివృద్దే
అందుకే రండి బాబూ రండి
భలే మంచి చౌక బేరము
ఇది సమయమ్ మించినన్ దొరకదు
త్వరంగొనుడు సుజనులారా
భలే మంచి చౌక బేరం