12, జులై 2016, మంగళవారం

సీనరీ ఆఫ్ సన్

సరే !! ఇయ్యన్ని పక్కనెట్టి
ఈస్ట్ లో రైజింగ్ సన్ను ను సూడు
ఎర్రగా ఆషాడ మాసం లో అమ్మాయి
పెట్టుకొన్న గోరింటాకు లా మెరుత్తున్నాడు
కూసంత మనసులో కళాపోసనేసుకోని సూడ్రా !!
ప్రపంచం ఆశలన్నీ కళ్ళల్లో పెట్టుకొని
జాబ్ కోసం కొత్తగా బస్తీలో ఎర్రబస్సు దిగే కుర్రాడి
అమాయకపు నవ్వులా ఎలిగిపోతన్నాడు
సీ యార్ !!
దిస్ సీనరీ ఆల్వేస్ రాక్స్
********
లుక్ ఒన్స్ ఎగైన్ ఇన్ ద స్కై
ఈస్ట్ నుండి పైకి జరిగే కోద్దీ
ఎర్రసూరీడు తెల్లసూరీడుగా చేంజ్ ఓవర్ అవుతుంటాడు
గోరింటాకు తడి ఆరిపోయి రాలిపోతుంటది
రక్తహీనత తో చేతులు తెల్లగా పాలిపోయుంటాయి
ఒరేయ్ ! కళాపోసనే కాదు రా
ఉదరపోషణ కూడా కావాలి
బస్తీ కొచ్చిన కుర్రాడి కి అడుక్కో హర్డిల్
హర్డిల్ కో అవమానం
మంటెత్తిన సూరీడు నిండా నిప్పులు కురిపిస్తాడు
బ్లోయింగ్ సన్ ని సూడలేక
కంటి నిండా నీళ్ళు చిప్పిల్లుతాయి
బిలీవ్ మీ బాస్
అల్వేస్ టియర్స్ ఆర్ పెయిన్ ఫుల్
*******
వైప్ యువర్ టియర్స్ అండ్ లుక్ దేర్
మిడ్ ఆఫ్ ది స్కై నుండి
సూరీడు వెస్ట్ కి జారటం స్టార్ట్ చేస్తాడు
నడిచి నడిచి సూరీడు అలిసిపోయి
చెమట తాగేస్తుంటాడు
ఓన్లీ ,లోన్లీ సన్
ఏడ్చి ఏడ్చి నిస్సహాయంగా
కూలబడ్డ అమ్మాయి ఎర్రటి కళ్ళలా ఉంటాడు
మనసులో కూసంత మడిసినేసుకు సూడరా !!
ఆశలన్నీ రాలిపోయి , బస్తీ లో బతకలేక
తిరిగి ఊరొచ్చిన బస్సు రేపిన ఎర్రటి దుమ్ము లా
మసగ మసగ్గా అగుపడతాడు సూరీడు
ట్రస్ట్ మీ
డార్క నెస్ నెవర్ లీవ్స్ అజ్

ఎ మిస్టేక్

యస్ ! సమ్ బర్డన్స్ ఆర్ ఇన్ కమ్యూనికబుల్
అంతే కొన్ని బరువులు మొయ్యాల్సిందే
వైయింగ్ మిషన్ భుజానేసుకొని ఎప్పటికప్పుడు
వెయిట్ అప్ డేట్ చెయ్యాల్సీందే !!
కళ్లకింద క్యారీబాగ్స్ తీసెయ్యటానికి గ్రాఫిక్స్ ఉన్నాయి కానీ
కళ్ళ ముందు కనబడే క్యారీబాగ్స్ తీసెయ్యటానికి ఏ సిజర్స్ లేవు
పాస్ట్ ఈజ్ పాస్ట్ అని చెప్పుకోవటానికి లేదు
పాస్ట్ నీకంటే ఫాస్ట్ గా నీ ఫ్యూచర్ కి అడ్డం పడుతూ ఉంటుంది
తప్పదు బాస్ అనుకొని తలొంచుకొని కాంప్రమైజ్ కావాల్సిందే !!
*******
మిస్టేక్స్ ఆర్ పార్ట్ అఫ్ ది డ్యూస్ , వన్ ఫేస్ ఫర్ ఎ లైఫ్ టైమ్ యార్
మనం గతాన్ని పరిక్షగా చూసే సమయంలో అక్కడక్కడ
రెడ్ మార్క్స్ పెట్టుకొని కొట్టేసుకున్నా, మార్క్స్ తగ్గక తప్పదు
ఇంపాక్ట్ రిజల్ట్ మీద ఉండకా తప్పదు .
పొరపాటున పర్మినెంట్ టాటూ పొడిపించుకున్నాక
కవర్ చేసుకున్నా కన్పించకుండా పోదు .
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా రియలిస్టిక్ లుక్ ఉండదు
*******
రిమోర్స్ ఈజ్ ద పాయిజన్ ఆఫ్ లైఫ్ అన్నది నిజమే కానీ
స్నేక్ తింటుందని ఎలుకలన్నీ ఏరి తెచ్చి
ఇచ్చుకున్నా, పాము కాటెయ్యక మానదు
యాంటివెర్నమ్ ఇంజక్షన్ లేకపోవటం బ్యాడ్ లక్ కానీ
స్నేక్ బైట్ ఈజ్ క్వైట్ కామన్ !!
******
మైండిట్ !! ద సిన్ విల్ చేజ్ యూ ఆల్వేస్
ఆనెస్టీ గా తప్పొప్పుకోవటమే బెటర్
మిస్టేక్స్ అండ్ రిగ్రెట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్