వాకిట్లో కొంచెం
రోజ్ వాటర్ చల్లేసి
అహ్వానించేశాక అందరూ
ఆత్మీయ అతిధులే
వీరాధివీరులే
రణరంగ ధీరులే
ఉద్యమ రధసారధులే.
రధం లాగే గుర్రాలదేముంది
ఆఫ్ట్రాల్ ఉలవలు
తినేవి.
కొరడా ఉన్నోడి
చేతిలోనే కదా
పరుగెత్తించే పగ్గాలు .
గ్యాలప్ హార్స్, గ్యాలప్
యుద్దం ముగిశాక
పచ్చగడ్డి కోసం కూడా పరుగులెత్తాలి .
బాగా అలవాటు చేసుకో .
*********
పాదుకాపట్టాభిషేకం
కి ప్రామిస్ చేసి
ఫారెస్ట్ నుండి
బయటకు రాగానే పక్కనేసి
పదవిలో కుదురుకున్నాక
కోదండం కూడా దండగమారి
ధనస్సే అవుతుంది
అయోధ్య ఒక మిధ్యాపురి
అవుతుంది.
అందర్ద్నీస్వాగతించాక
జరిగే
మద్యపాన విందులో
సైనికుడి పని
మౌనంగా కాపలా కాయటమే
అవ్వాలి కాని,
గ్లాసు పట్టుకొని
రిలాక్స్ అవుతాను అంటే
రూల్స్ ఒప్పుకోవు
దేశం ఏదైనా సోల్జర్స్
ఎప్పుడూ
రూలర్స్ చెప్పింది
ఫాలో కావాల్సిందే ,
సో మైడియర్ సోల్జర్
బీ సైలెంట్
డోంట్ మేక్ నాయిస్ .
*********
కోటలోనే కాదు, దేశంలోనే
నిశ్శబ్దం నింపెయ్యటమే
నిఖార్సైన విజయం
మంత్రించి సాధించబోయే
బంగారం కోసం
వరుసల్లో నుంచొని
ఇంట్లో ఉన్న ఇత్తడి
ముక్కలన్నీ
సమర్పించి తలెత్తకుండా
వెనక్కి తిరిగి
పరిగెత్తటమే
సిసలైన పరుసవేది
సిద్ద మంత్రం
పరమాన్నం ఆకులో
పెట్టిస్తే
ఉన్నవన్నీ పళ్ళెంలో
పెట్టి
సమర్పించి తప్పుకోవటమే
పరమ రాజభక్తి
రాజభక్తులందరినీ
ఫొర్ట్ కి కాపలా
పెట్టి
కంఫర్ట్ గా నిద్రపోవటమే
అసలైన డెమోక్రసీ
హెన్స్ వుయ్ కెన్
సే ప్రౌడ్లీ
బంగారు రాజ్యం జిందాబాద్