14, ఫిబ్రవరి 2016, ఆదివారం

దోడ తిత్తివా

అతనో ప్రవాహం
సుజల జ్వలిత గోదావరి తట
జీవిత , తాడిత , పీడిత, కోయ, సవర
గదబ, చెంచుల రణన్నినాదం
అనగనగా ఒక అరుణ్ , అనగా ఒక కవి
ఇంకా విపులంగా చెప్పవలెనన్న ఒక విలేఖరి
మరింత విపులీకరించి, వివరించవలెనన్న
ఒక మేల్ కొలుపు గీతా సాగరుడు.
వెరిసి అతనొక "షాన్ "
* * * * * *
ఎక్కడో వినిపించీ వినపించని కొమ్ముబూర శబ్దం
బహుశా బ్యాగ్రౌండ్ మ్యూజిక్
ఒక ఇంటలెక్చువల్ విన్నపం అనుసరించి
ఇప్పుడొక ప్రాయోజిత కార్యక్రమం
సీదర సెంద్రయ్య రేల పాట
"రేలరేలరేల రేరేలా రేల రేలా రేరేలా "
రిధమిక్ గా సాగిపోతున్న పాట
"యు నో ! ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్
ఈ సాంగ్ పాడే ట్రైబ్స్ ఆర్ గోయింగ్ టూ వానిష్"
విషాదంగా గొంతులోకి దిగుతున్న షాంపేన్
మెట్రో సిటీ లోని కాస్మోపాలిటన్ క్లబ్బుల నిండా
నిషా నింపుకున్న కళ్ళకు కూడా ఫ్రేం అంతా
బ్లర్డ్ విజన్ లో మాయమవుతున్న రావిచెట్టును
పిట్టను పరిచయం చేసిన రిలాక్స్ ఎరుగని హెర్క్యులెస్
* * * * *
పాపి కొండల నడుమ వంపు తిరిగిన
ఆ నదిని గాడాలింగనమున చుంబించి
తొలిప్రేమల రహస్యాలను దమ్మక్క చెవిలో చెప్పి
రాముడితో గోదారికి రాయబారమంపిన ధీశాలి
*పీకే కి తునికాకు పళ్ళిచ్చి , వనం కోసం ఎడారిలో
అంజనం వేసి అచ్చు అమ్మ గొంతుతో *దోడ తిత్తివా
అని ప్రేమతీరా అడిగిన కరుణ సాగరుడు .
* * * * * *
అవేర్ ఆఫ్ ఆల్ దీజ్ థింగ్స్
ఒక్కటే ప్రశ్న బ్రో !!
ఓ అరుణ సాగరుడా
నీ కవిత్వాన్ని
జర్నలిజాన్ని , అడవిబిడ్డల్ని
వదిలి ఎందుకు వెళ్ళావు ??
ఐ నో యూ విల్ బీ దేర్ ఎట్
ద మీటింగ్ పాయింట్ ఆఫ్ స్కై అండ్ ఎర్త్
సుదూర తీరం నిండా నువ్వే గోదారంతై పరుచుకున్నావు
అగైన్ ఆవేర్ ఆఫ్ దీజ్ థింగ్స్
కొన్ని ప్రశ్నలు
దిగులు దీపపు స్తంభపు నుండి రాలుతున్న కాటుక చీకటి
నయనాల నిండా నిండిపోయి పొర్లుతున్న
దు:ఖాశ్రువుల ను ఏ లేపనాలు
పూసి తగ్గించాలి ??
చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురవుతున్న
నిర్వాసితుల నివేదనా గాధలు ఎవరు వినాలి ?
ఇప్పుడు కురసం ముత్తమ్మ
వనమంతా తిరిగి తిరిగి ఏరుకొచ్చిన
తట్టలోని రేగిపళ్ళు ఎవరు తినాలి ?
సీతాకోకచిలుక రెక్కలంచు కోకా రవికల
నేరేడు రంగు పీకే తెచ్చిన ఇప్పసారా ఎవుడు తాగాలి ??
ఇయన్నీ పోనీ గానీ
అన్నా ! అరుణన్నా !!"దోడ తిత్తివా " అన్నా !!
* పీకె == కోయ భాషలో పిల్ల
* దోడ తిత్తివా = కోయ భాషలో "అన్నం తిన్నవా

అబిస్టినేట్ బాస్టర్డ్

టెస్టోస్టిరాన్ ని భుజాల మీద వేసుకోని
ఊరేగే స్పెర్మెటజోవాలు
ఊరంతాపరచుకొని,
ఎక్కడైనా ఈస్ట్రోజన్ జాడలు
కనిపిస్తాయోమోననని స్ట్రీట్సన్నీ తిరిగేస్తున్న
చిత్తకార్తె రాత్రి లో
 నగరం వీధి... వీధి
తిరుగుతుంది
పెల్విక్ త్రష్ట్ కోసమే పుట్టిన
 పర్వర్టేడ్ మేల్ చావోయిజం
ఊడలమర్రిలా నడిబొడ్డూన ఊరేగుతుంది
మస్కులైన్ మోరోన్
సెక్స్ కొసం ఫీనిక్స్ పక్షిలా
ఎన్ని సార్లు కాల్చి బూడిద చేసినా
మళ్ళీ మళ్ళీ వైరస్ లా పెరుగుతుంది
సమాజం మొత్తం ఫార్మాలిన్ సొల్యూషన్ లో
తేలాడే చచ్చిన శవం లా పడుకొనుంది
అడుక్కో అబిస్టినెట్ బాస్టర్డ్ తో
నిండిపోయిన
మోడరన్ సొసైటీ లో ఫెమినిజమో ఇల్యూజన్
ఇది ఇంబసైల్ సివిలిజైషన్ బాస్
ఇక్కడ రివల్యూషన్ కి నో చాన్స్
ఫిమేల్స్ ఆర్ బార్న్ టు బేర్ ద ఫ్రస్ట్రేషన్స్
ఎన్ని జనరేషన్స్ చేంజ్ అయినా
ఎప్పటికీ ఇదే సోషల్ జస్టిఫికేషన్
అన్ రిటన్ కాన్ స్టిట్యుషన్ ప్రకారం
అమలవుతున్న రూల్స్ లో
వుమెన్ ఆల్వేస్ ఎ సెకండరీ సిటిజెన్
హెన్స్ మై డియర్ మహిళా తెలుసుకో
ఈ సొసైటీ మేల్స్ దే కానీ మీది కాదు
గో ఎవే ! ఫ్రం దిస్ వరల్డ్,
ఇక్కడ ఉండొద్దు ...,
ఉంటే.......
ఏ నైట్లో , ఎక్కడ నేకెడ్ మార్చ్
చెయ్యాల్సి వస్తుందో
ఏ డే లో , ఏ మోంగ్రెల్ లస్ట్ కి
బలి కావాల్సివస్తుందో.....
గో బ్యాక్ టూ వీనస్
డోంట్ స్టే హియర్

యుద్దానికో కాలం

యుద్దం ఓడిపోయావు సరే !
ఇప్పుడు తిరిగి యుద్దం
ఎక్కడి నుండి ఆరంభిస్తావ్ !!
గతం నుండా ! వర్తమానం నుండా !
భవిష్యత్తు ఆశాకిరణం మీద మెరుస్తున్న
విజయపు వెలుగుల నుండా !!
ఎక్కడనుండి ??
కాలం మొత్తం కత్తుల వంతెన అయి పయనం సాగుతున్నప్పుడు
వేసే ప్రతి అడుగు ఊఫిరి పోస్తూనే ఉంటుంది
ఊపిరి తీసుకున్న ప్రతి సారి కొత్త ఉనికి దొరుకుతూనే ఉంటుంది
రెండు కన్నీటి బొట్లుగా గడిచిన కాలం మిగిలిపొయాక
నీటి పొర వెనుక నుండి
మసగ్గా అయినా రేపు నవ్వుతూ కనిపిస్తుంది
గతం మొత్తం పొలుసులుగా రాలిపోయి ,
వర్తమానం నిలుచున్నప్పుడు
చిన్న కదలిక కూడా అశగా నిలుస్తుంది .
మునుపెప్పుడో పుట్టిన ప్రవాహం
నేడిక్కడ నీటిబొట్టు కూర్చుకుంటుంది
మున్ముందు సముద్రాన్ని డీ కొడుతుంది
ఎన్నాళ్లని గతం చూరును పట్టుకొని చూపులేని గభ్భిలం లా వేలాడతావు
రేపటి వర్తమానాన్ని సూరీడు కన్నా ముందే చూసే పక్షిలా మారిపో
అందుకే గతం చేతులు కడిగి
ఈరోజు ను నిండా పులుముకొని
వచ్చే విజయాన్ని హత్తుకోవాలి
పూడ్చేసిన దుఃఖపు సమాధుల నుండి
ఇప్పుడు కురుస్తున్న కన్నీటి వర్షం మొత్తం తాగేసి
నువ్వొక నవ్వే పువ్వై మెరవాలి

1, ఫిబ్రవరి 2016, సోమవారం

బలికత్తి

అక్కడ చెట్లకు కొమ్మలంత
సహజంగా ఉరితాళ్ళు
ఆకులంత సహజంగా కన్నీళ్ళు.
మంద్రంగా వీచే మరణపు గాలులు
గాలుల్లో కలిసి వినిపించే నినాదాలు
ఆ పెనుగాలుల మధ్య ఎగిరిపోతూ
ఎవరికీ చిక్కని ఒక చిన్న కాగితం
* * * * * * * * *
ఎవ్వరు చచ్చారో తెలుసు
ఎక్కడ చచ్చారో తెలుసు,
ఎందుకు చచ్చారో తెలుసు
ఆ చావు పుట్టింది ఎక్కడో
ఎవరికి తెలుసు !!??
కారణం తో పనేముంది కానీ
చావు మాత్రం అందరికీ పండగే
చచ్చాకా శవం నిండా దండలే !!
బ్రతకటమే మరీ దండగమారిది
* * * * * * * * * * *
మనువాదపు మండువా లోగిలి
బలి కోరింది సరే !!
మరోవాదపు వెలివాడలు కూదా
లాలించకపోతే ఎలా
ఇద్దరూ చెరో కొస అయి లాగితే
పెగలని గొంతు కి చిరునామా
శాశ్వత మౌనమేగా !!
భావజాల ఘర్షణలో బలి కత్తి
ఎప్పుడూ చూసేది బర్బరీకుడి కోసమే
నక్షత్ర ధూళి నుండి మసక మసగ్గా
కనిపిస్తున్న భూగోళం చూసి
ఆ తల పలికేదొక్కటే !!
"మోసం ! మోసం ! మోసం !"