10, సెప్టెంబర్ 2015, గురువారం

మరణం అంచున

సరిగా గుర్తు పెట్టుకో
నీలం నిక్కరు, ఎర్ర చొక్కా ప్రతిచోట
స్కూల్ యూనిఫామే కానక్కర్లేదు
శరణార్ధుల మరణానికి
వేసిన చిన్నారి తొడుగు కూడా కావచ్చు
బీచ్ లో పడుకున్నవారిలో
హాలిడే ఆస్వాదించే వారే కాదు ,
ఆయువు తీరిన చిన్నారులు ఉంటారు
‘జాస్మిన్’ పందిరి మొదల్లో ఆంకుల్ శాం వదిలి వెళ్ళిన
అనకొండ ‘ఐసిస్’ అని బుస కొడుతుంది
మన్నులో ఉన్న ఆయిల్ కోసం, మనుషుల మీద
ఆయిల్ పోసి రాజేసిన అగ్గి ఆరకుండా మండుతోంది
సెర్బియన్, సిరియన్, లిబియన్ ఎవరైనా భయం గుప్పిట్లో
ముడుచుకొని పడుకోవాల్సిందే .
కాదని మొండికేసి  బతుకు కోసం
బయల్దేరితే కసిగా కాటెయ్యటానికి మెడిటేరియన్  సీ
సిద్దంగా ఉంది
కంచె దాటితే ఆకలి తీరుతుంది అనుకోవటానికి
అంతర్జాతీయ సమాజమేమి అమ్మ కాదు అన్నం పెట్టటానికి
హోం లెస్ పీపుల్ ని  కడుపులో పెట్టుకోలేని రూత్ లెస్ సిటిజెన్స్
నడియాడూతున్న నరమేధపు నేల.
అందుకే ఇప్పుడు అందరూ బోట్లెక్కి నీట్లోకి దూకండి
అబ్దుల్లానో, అయలాన్ కుర్దీనో ఎవరో ఒకరిని అనుసరించండి
ఏదో ఒక తీరానికి ఖచ్చితంగా శవాలై చేరుతారు
అంత్యక్రియలకు ఐక్యరాజ్యసమితి నిధులు బాగానే పోగేసింది

బీ రడీ టూ డై ! వరల్డ్ వాంట్ టూ సెలబ్రేట్ ఇట్

పీనల్ కాలనీ


ఎవడో కిన్లే బాటిల్ బోర్లించినట్లున్నాడు
జనాల ముఖాల నిండా నిజాయితీ
బొట్లు బొట్లుగా కారుతోంది.
గద్దలన్ని గ్యాదర్ అయ్యి
పిచ్చుకలు తినే జొన్న కంకులను
లాక్కొచ్చి జాగ్రత్తగా పొలానికి ఫెవికాల్ తో అంటిస్తున్నాయి.
వేకప్ మ్యాన్ ! వేకప్ ! దిస్ ఈజ్ ద టైం !!
చేనుకు చేవ ! రైతుకు రొక్కం !
గ్రోమోర్ బాబూ ! గ్రోమోర్ !
ఎక్కువ జొన్నలు పంచెయ్
పిచ్చుకలు ఉచ్చులో దొరుకుతాయి
పట్టుకొచ్చిన గద్దలు పెద్దమనుషులవుతారు.
మై లార్డ్ ! సేక్రేడ్ సెయింట్ ! మై సేవియర్
ప్రపంచం మొత్తం ప్రవచనాలతో ఫిల్ చెయ్యి
జనం మొత్తం చెవులు రిక్కించారు
మైక్ లన్నీ మైకం  కమ్మి  ఊగుతున్నాయి.
కమాన్ ! ఓ పవిత్రుడా ! కమాన్ !
శుద్ద జలాలను తలపై చల్లి
మమ్మల్ని పరిశుద్దులను చెయ్యి
గింజలు తినే జన్మ ఎందుకు
గద్దల వలె గద్దెనెక్కి
న్యాయాన్యాయ విచక్షణ
ధర్మాధర్మ పరిరక్షణ
పాప జన సంప్రోక్షణ
నిరంతరం సాగిస్తాం
తిలా పుణ్యం, తలా పిడికెడు పంచేస్తాం
బట్, పిటి ఏంటంటే మనమందరం
^పీనల్ కాలనీ లో బ్రతుకులీడిస్తున్నోళ్ళం బ్రో !!
^ హారో ఈజ్ ఆల్వేస్ షార్ప్
ఇప్పటి బ్రేవ్ సోల్జర్ , కథలో ట్విస్ట్ వచ్చి
క్లైమాక్స్ లో ప్రాణాలొదిలేస్తాడు.
రిమెంబర్ దిస్ యార్
కల్ప్రిట్ కాంట్ బి కానస్టంట్
రేపటి చాన్స్ నీదే కావచ్చు
బీ ! ప్రిపేర్ ఫర్ దట్ పనిష్మెంట్

^ పీనల్ కాలని : నేరస్తులను బంధించే ఒక కాలని
^ హారో : మరణ శిక్షకు వాడే ఒక యంత్రం