10, జనవరి 2014, శుక్రవారం

ఒక ప్రత్యూషం

ఒక ప్రత్యూషాన, ఆ తోటలో
తుషార బిందువులు ఆకులని
ముద్దిడి, కరిగిపోతున్న వేళ
కిటికీ పక్కన కాఫీ కప్పుతో నేను
నా పక్కన నువ్వు,
నీ కురుల వాసన మత్తుగా
అ గదంతా పరచుకుంటున్న సమయాన
రాత్రి మల్లెలు వాడినా ఇంకా వేడిగా చూస్తూ
అగరొత్తుల పొగ మన చుట్టూ ఏకాంత మేఘమై
అలముకుంటూ. తమకంతో నేను కళ్ళు మూసుకుంటే
పెరటి గులాబీలు వంగి నీ పాదాలు చూసి
సిగ్గుతో మరింత తలదించుకుంటున్నాయి
భ్రమరాలు మందారాల పై కాక, నీ అధారలపై
మధువునే చూడాలని ఆరాటపడుతుననయి
గోడవతల గన్నేరు పూలు నీ వంటి
చాయను కాస్తయినా పూసుకుందామని
గోడదాటి వస్తున్నాయి
కుండీలోని మరువాలు నీ మేని వాసన
పీల్చుకుందామని నీవైపు చూస్తున్నాయి
ఇన్ని చూపు బాణాలను తట్టుకుంటూ
సుతారంగా నుదుటి మీద నీలి మేఘాలను
తోసివేస్తూ, నీవు నా ముందు నిలిచి
నవ్విన క్షణాన, నాకు లక్ష భానోదయాలు కదా
నీ చిరునవ్వు తారకలు , నాకు
శత సహస్ర చంద్రోదయాలు

1 కామెంట్‌:

  1. ఆ చూపుల బాణాలను అలక్ష్యం చేస్తూ
    సుతారంగా
    ఆ విశాల లలాటం పైన వాలిన ఆ నీలి ముంగురులను
    తోసివేస్తూ, నీవు నా ముందు నిలిచి
    నవ్విన ఆ క్షణం

    చక్కని వర్ణన .... హృద్యమం గా .... అభినందనలు మోహన్ రావిపాటి! శుభోదయం!!

    రిప్లయితొలగించండి