చాలా
రోజుల తర్వాత సముద్రం దగ్గరకు వచ్చానేమో
కొద్దిగా
తడిచిన ఇసుక అమ్మవడిలా వెచ్చగా
ఉంది
ప్రశాంతమైన
చల్లటిగాలి నాన్న స్పర్శలా మెల్లగా తాకింది
అటు వైపు చూద్దును కదా
, ఊరి లాంటి సముద్రం లో
దూరంగా
మెరుస్తున్న నావ మీద దీపం
ఒడ్డుకొస్తూ
ఉప్పొంగుతుంది
అక్కడనుండి
రెండు అడుగులు వేసి
కొన్ని
జ్ఞాపకాలపల్లీ కాయలను జేబులో నింపుకొని
ఒక్కొక్క
కాయ వలుచుకుటూ వెళతాను
అదేమి
విచిత్రమో,
గబగబా
నాలుగు కాయలు తినేశాక
జేబు
నిండుగా
ఉంచుకోలేని,
పారవెయ్యలేని
తాలు
కాయలు మిగిలిపొ తాయి
ఒక్కొక్కటి
ఓపిగ్గా వలిచి చూసుకుంటా !
ఎక్కడైనా
శక్తి నిచ్చే గింజ ఒకటైనా
దొరక్కపోతుందా
అని !!
అక్కడక్కడా
చేదుగింజలు కూడా మింగి
అన్నీ
ఖాళీ అయ్యాక ఒక్కసారిగా
పెదవుల మీద చిరునవ్వు బెల్లమ్ముక్క
ఒకటి
తియ్యగా అంటుకుంటుంది.
తృప్తిగా
అక్కడనుండి తిరిగి బయల్దేరుతా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి