సరే !! ఇయ్యన్ని పక్కనెట్టి
ఈస్ట్ లో రైజింగ్ సన్ను ను సూడు
ఎర్రగా ఆషాడ మాసం లో అమ్మాయి
పెట్టుకొన్న గోరింటాకు లా మెరుత్తున్నాడు
కూసంత మనసులో కళాపోసనేసుకోని సూడ్రా !!
ప్రపంచం ఆశలన్నీ కళ్ళల్లో పెట్టుకొని
జాబ్ కోసం కొత్తగా బస్తీలో ఎర్రబస్సు దిగే కుర్రాడి
అమాయకపు నవ్వులా ఎలిగిపోతన్నాడు
సీ యార్ !!
దిస్ సీనరీ ఆల్వేస్ రాక్స్
ఈస్ట్ లో రైజింగ్ సన్ను ను సూడు
ఎర్రగా ఆషాడ మాసం లో అమ్మాయి
పెట్టుకొన్న గోరింటాకు లా మెరుత్తున్నాడు
కూసంత మనసులో కళాపోసనేసుకోని సూడ్రా !!
ప్రపంచం ఆశలన్నీ కళ్ళల్లో పెట్టుకొని
జాబ్ కోసం కొత్తగా బస్తీలో ఎర్రబస్సు దిగే కుర్రాడి
అమాయకపు నవ్వులా ఎలిగిపోతన్నాడు
సీ యార్ !!
దిస్ సీనరీ ఆల్వేస్ రాక్స్
********
లుక్ ఒన్స్ ఎగైన్ ఇన్ ద స్కై
ఈస్ట్ నుండి పైకి జరిగే కోద్దీ
ఎర్రసూరీడు తెల్లసూరీడుగా చేంజ్ ఓవర్ అవుతుంటాడు
గోరింటాకు తడి ఆరిపోయి రాలిపోతుంటది
రక్తహీనత తో చేతులు తెల్లగా పాలిపోయుంటాయి
ఒరేయ్ ! కళాపోసనే కాదు రా
ఉదరపోషణ కూడా కావాలి
బస్తీ కొచ్చిన కుర్రాడి కి అడుక్కో హర్డిల్
హర్డిల్ కో అవమానం
మంటెత్తిన సూరీడు నిండా నిప్పులు కురిపిస్తాడు
బ్లోయింగ్ సన్ ని సూడలేక
కంటి నిండా నీళ్ళు చిప్పిల్లుతాయి
బిలీవ్ మీ బాస్
అల్వేస్ టియర్స్ ఆర్ పెయిన్ ఫుల్
ఈస్ట్ నుండి పైకి జరిగే కోద్దీ
ఎర్రసూరీడు తెల్లసూరీడుగా చేంజ్ ఓవర్ అవుతుంటాడు
గోరింటాకు తడి ఆరిపోయి రాలిపోతుంటది
రక్తహీనత తో చేతులు తెల్లగా పాలిపోయుంటాయి
ఒరేయ్ ! కళాపోసనే కాదు రా
ఉదరపోషణ కూడా కావాలి
బస్తీ కొచ్చిన కుర్రాడి కి అడుక్కో హర్డిల్
హర్డిల్ కో అవమానం
మంటెత్తిన సూరీడు నిండా నిప్పులు కురిపిస్తాడు
బ్లోయింగ్ సన్ ని సూడలేక
కంటి నిండా నీళ్ళు చిప్పిల్లుతాయి
బిలీవ్ మీ బాస్
అల్వేస్ టియర్స్ ఆర్ పెయిన్ ఫుల్
*******
వైప్ యువర్ టియర్స్ అండ్ లుక్ దేర్
మిడ్ ఆఫ్ ది స్కై నుండి
సూరీడు వెస్ట్ కి జారటం స్టార్ట్ చేస్తాడు
నడిచి నడిచి సూరీడు అలిసిపోయి
చెమట తాగేస్తుంటాడు
ఓన్లీ ,లోన్లీ సన్
ఏడ్చి ఏడ్చి నిస్సహాయంగా
కూలబడ్డ అమ్మాయి ఎర్రటి కళ్ళలా ఉంటాడు
మనసులో కూసంత మడిసినేసుకు సూడరా !!
ఆశలన్నీ రాలిపోయి , బస్తీ లో బతకలేక
తిరిగి ఊరొచ్చిన బస్సు రేపిన ఎర్రటి దుమ్ము లా
మసగ మసగ్గా అగుపడతాడు సూరీడు
ట్రస్ట్ మీ
డార్క నెస్ నెవర్ లీవ్స్ అజ్
మిడ్ ఆఫ్ ది స్కై నుండి
సూరీడు వెస్ట్ కి జారటం స్టార్ట్ చేస్తాడు
నడిచి నడిచి సూరీడు అలిసిపోయి
చెమట తాగేస్తుంటాడు
ఓన్లీ ,లోన్లీ సన్
ఏడ్చి ఏడ్చి నిస్సహాయంగా
కూలబడ్డ అమ్మాయి ఎర్రటి కళ్ళలా ఉంటాడు
మనసులో కూసంత మడిసినేసుకు సూడరా !!
ఆశలన్నీ రాలిపోయి , బస్తీ లో బతకలేక
తిరిగి ఊరొచ్చిన బస్సు రేపిన ఎర్రటి దుమ్ము లా
మసగ మసగ్గా అగుపడతాడు సూరీడు
ట్రస్ట్ మీ
డార్క నెస్ నెవర్ లీవ్స్ అజ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి