19, డిసెంబర్ 2016, సోమవారం

లిబర్టీ ఈజ్ ఎ స్టాట్యూ

లిబర్టీ స్టాట్యూ అయిన దగ్గర ఇంత కంటే
నువ్వుంకేమి ఎక్స్ పెక్ట్ చేస్తావు బాస్ !!
అక్కడేమీ కుడి ఎడమ ల
దగా లేదు, తగాదా లేదు
నువ్వు బాధ పడిపోవటానికి.
రైట్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనటానికి
అలవాటు పడిపోయినోళ్ళ కంట్రీ !!
ఎటొచ్చీ రైట్ లోనే వెతుక్కోవాలి
ఏది రైట్ ! ఏది రాంగ్ అని !!
********
ఒంటి చేత్తో ప్రపంచాన్నీ
ఎన్ లైటన్ చేసే కెపాసిటీ
తనకే ఉందని అంకుల్ శామ్
కుడిచేత్తో టార్చ్ లైటేసుకొని
బయల్దేరాక
న్యాయ సూత్రాలన్ని ఎడమ చేత్తో
తీసెయ్యక తప్పదు
ఏడు ఖండాలు వాడి టోపీ మీద
ఈకలు కాకా మానవు.
పోలీసోడి నేమ్ ప్లేట్ మారినంత
మాత్రన డ్యూటీ మారదు.
వాడి చేతిలో లాఠీ మారదు.
లాఠీకున్న పవరూ మారదు
ఎటొచ్చీ ఆ లాఠీ చార్జ్ లోనే వెతుక్కోవాలి
ఎవరు సేఫ్ !! ఎవరు కాదు అని !!
********
తనకు ఎదురు చెప్పటమే
వయలేషన్ ఆఫ్ రైట్శ్ అని
కాళ్లకింద తొక్కిపట్టి

 షాకెల్స్ తో కట్టి పడెయ్యటమే
అల్టిమేట్ పీస్ అంటూ
అల్టిమేటం జారీ చేశాక
పీస్ ఫుల్ వరల్డ్ , అనే డ్రీమ్
సాకారం కాక చస్తుందా !!
గుప్పిట్లో ద గ్రేట్ సీల్ పట్టుకొని
కార్డ్స్ ఆడుకోవటం ఎప్పుడో
స్టార్ట్ అయ్యింది
ఎటొచ్చీ ఆ కార్డ్శ్ లోనే వెతుక్కోవాలి
ఏదీ ట్రంప్ కార్డ్ ! ఏది వేస్ట్ కార్డ్ అని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి