అమ్మ అంత సహజంగా అమ్మకం అలవాటయ్యాక
మారకానికి పనికిరానిదంటూ ఉంటుందా !
కొనేవాడికి మూడ్ ఉన్నప్పుడు
సరుకు అందివ్వటమే
వ్యాపారంలో విజయ రహస్యం.
కొనేవాడికి లేని నీతి, బూతు
అమ్మేవాడికుండాలి అనుకోవటమే
అసలైన బూతు
కొన్నంత కాలం అమ్మకం సాగించటమే
సిసలైన ఆర్ధిక నీతి
అసలు , అంగాంగం
అంగట్లో దొరుకుతుంటే
అందం కనిపించకుండా అమ్మేది ఎలా ??
అమ్మేది ఎవడైనా ,
నీలాగే వాడూ ఒక మారకం దారుడే
అమ్మేది ఏదైనా, ఎవరినినైనా
నీ లాగే అన్నీ అంగడి సరుకులే
అయినా , ఎటూ కొనాలనుకున్నాక ,
అమ్మకం ఆపేయమని
అరవటం ఎందుకు ?
కావాలంటే రేటులో రిబేటు అడిగి
మొదటగా కొనుక్కోవాలి కానీ
వాణిజ్య సూత్రాల్లో జీవితాలు సర్దేశాక
కళ్ళు మూసుకొని అన్నీ
నిజాలు అనుకొని సుఖించాలి కానీ
కళ్ళు తెరిచి దు:ఖించటం ఎందుకు
టేకిట్ ఈజీ ! లెట్స్ సెలబ్రేట్ దిస్ ఈవెంట్
అమ్మటానికి మనకో కొత్త ప్రోడక్ట్ దొరికింది
అమ్మేద్దాం ! దట్సాల్ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి