25, జూన్ 2015, గురువారం

ఛాయిస్

తళుకుల్, వెలుగుల్,  జిలుగుల్
వెండితెర తారకల్ , ఆట విడుపుల్
మధ్యే మధ్యే మద్య పాన చిత్తుల్
ఇప్పుడు  ఒకానొక ఉదాయాన
ఒకానొక సినిమా ప్రారంభం
 సైలెంట్ ఆన్ సెట్స్, ఆల్ లైట్స్ ఆన్
క్లాప్ ఇన్,  పర్ఫెక్ట్
షాట్ ఓకే
లైట్స్ ఆఫ్
ప్యాకప్
రెమ్యూనరేషన్
ఇంకా కావాల్సినంత
సినిమా పేరు
“మై ఛాయిస్ “
ట్యాగ్ లైన్ “మహిళా సాధికారత”
కట్ చేస్తే
******
“అమ్మా ! రేపే పరీక్ష ఫీజు”
చెవిలో చెప్పిన మాట
గిరగిరా తిరుగుతున్న శబ్దం
శుక్రవారం సాయంత్రం
రావాల్సిన  కూలీ లెక్క
ఇంకా 500 లోటు
రెండో ఆట సినిమా కొస్తే
ఇస్తానన్న మేస్త్రీ వెకిలి నవ్వు
వెళ్ళటమా ! మానటమా !
 ఛాయిస్ కి  ఛాన్సే లేదు
టేక్ 2 టికెట్స్
యట్ కార్నర్ సీట్స్
వాచ్ ద మూవీ ఇన్ డార్క్,
విత్ డాగ్స్ ఇన్ థియేటర్
   ******
ఇప్పుడు ప్యాకప్ అయి సేద తీరుతున్న
చలి మర గదుల సుఖ సాయంత్రం వేళ
ఆలోచన.
ఈ అర్ధ రాత్రి చిందులకోసం
విచ్చేస్తున్న తారా తోరణానికి
స్వాగత సుమాంజలి
 వేర్ ఈజ్ ద వెన్యూ
లిక్విడ్స్ ఆర్ స్పార్క్స్
ఎగైన్ ఇట్స్ మై ఛాయిస్
  *****
రెండో ఆట సినిమా ముగిశాక
కళ్ళు మూతలు పడుతున్న వేళ
పెదవులు తెరచి నవ్వలేక నవ్విన నవ్వు
ఆకలికేడుస్తున్న ప్రేగులు
ఆటోలో ఇంటికి బయల్దేరుతూ
చీకట్లో చిరిగిన జాకెట్టు ని
ఎడమవైపు దాచుకోవాలా
కుడివైపు దాచుకోవాలా
ఇది కూడా
ఛాయిస్ లేదు
*****
సినిమా అయిపోయింది
ద ఎండ్ లెస్ స్టోరీ కంటిన్యూస్

ఆఫ్ట్రాల్ ఛాయిస్ ఈజ్ ఎ ప్రివలేజ్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి