4, జులై 2015, శనివారం

నువ్వు-నేను

నేను అద్దం నీ ముందు పెడతాను
పెదవులతో నువ్వు గాలి ఊదుతావు
నేనేమో నీ పేరు రాస్తాను 
మరుక్షణం చెదిరిపోతుంది
అద్దం , గాలి శాశ్వతం
పెదవులు , పేరు కావు
అది తెలిసి నువ్వు తారాజువ్వలా నవ్వుతావు
అది ఏ క్షణంలో నేల జారుతుందో అని నేను చూస్తాను
నువ్వు నేను శాశ్వతం కాదు
నేల, కాలం శాశ్వతం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి