4, జులై 2015, శనివారం

సరదా కవిత

నిన్ను చూడగానే నా గుండె
ఎదురుగాలిలో గొడుగులా ఎగురుతుంది
నువ్వు నవ్వగానే మా ఇంట్లో
పవర్ కట్ లేని కరెంటు ఉంటుంది
నువ్వు పలకరించగానే నా కాళ్ళు
హైదరాబాద్ ఆటోలా పరుగెత్తుతాయి
ఇక నువ్వు తాకితే నా వళ్ళంతా
రింగ్ రోడ్ మీద "ఆడి" కారై పోతుంది
మొన్న గుళ్ళో నువ్విచ్చిన కొబ్బరి ముక్క
నిన్న పార్క్ లో ఇచ్చిన వేరుశెనక్కాయ
టాంక్ బండ్ మీద కొనిచ్చిన బఠానీ ముక్క
కరాచీ బేకరీలో తీసుకొన్న బన్ను ముక్క
మల్టిక్యుజిన్ రెస్టారెంట్లో చీఫ్ షెఫ్ వండి
వార్చి పెట్టిన దానికన్నా టేస్టు గుంటాయి
అసలు.. నీ గురించి చెప్పాలంటే
నీ ఫేసు వైజాగ్ స్టీలు ప్లేటు
నీ జడ గుంటూరు పొగాకు కాడ
నీ కళ్ళు తుపాకీ గుళ్ళు
నీ ముక్కు రామ చిలక
నీ చెక్కిళ్ళు సిమ్లా యాపిళ్ళు
నీ పెదవులు నారింజలు
ఇవన్నీ ఎందుకు నువ్వు నవ్వితే
ఉల్లిపాయలు రాలతాయి
ఇంతందంగా ఉండే నువ్వు
అలా ప్లైట్ ఎక్కి వెళ్లావు
నా ఫేట్ మారిపోయింది
డేట్స్ మారుతుంది కాని
నీతో డేటింగ్ లేక డైటింగ్
చేసిన కోడిలా అయిపోయాను
నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి