10, సెప్టెంబర్ 2015, గురువారం

పీనల్ కాలనీ


ఎవడో కిన్లే బాటిల్ బోర్లించినట్లున్నాడు
జనాల ముఖాల నిండా నిజాయితీ
బొట్లు బొట్లుగా కారుతోంది.
గద్దలన్ని గ్యాదర్ అయ్యి
పిచ్చుకలు తినే జొన్న కంకులను
లాక్కొచ్చి జాగ్రత్తగా పొలానికి ఫెవికాల్ తో అంటిస్తున్నాయి.
వేకప్ మ్యాన్ ! వేకప్ ! దిస్ ఈజ్ ద టైం !!
చేనుకు చేవ ! రైతుకు రొక్కం !
గ్రోమోర్ బాబూ ! గ్రోమోర్ !
ఎక్కువ జొన్నలు పంచెయ్
పిచ్చుకలు ఉచ్చులో దొరుకుతాయి
పట్టుకొచ్చిన గద్దలు పెద్దమనుషులవుతారు.
మై లార్డ్ ! సేక్రేడ్ సెయింట్ ! మై సేవియర్
ప్రపంచం మొత్తం ప్రవచనాలతో ఫిల్ చెయ్యి
జనం మొత్తం చెవులు రిక్కించారు
మైక్ లన్నీ మైకం  కమ్మి  ఊగుతున్నాయి.
కమాన్ ! ఓ పవిత్రుడా ! కమాన్ !
శుద్ద జలాలను తలపై చల్లి
మమ్మల్ని పరిశుద్దులను చెయ్యి
గింజలు తినే జన్మ ఎందుకు
గద్దల వలె గద్దెనెక్కి
న్యాయాన్యాయ విచక్షణ
ధర్మాధర్మ పరిరక్షణ
పాప జన సంప్రోక్షణ
నిరంతరం సాగిస్తాం
తిలా పుణ్యం, తలా పిడికెడు పంచేస్తాం
బట్, పిటి ఏంటంటే మనమందరం
^పీనల్ కాలనీ లో బ్రతుకులీడిస్తున్నోళ్ళం బ్రో !!
^ హారో ఈజ్ ఆల్వేస్ షార్ప్
ఇప్పటి బ్రేవ్ సోల్జర్ , కథలో ట్విస్ట్ వచ్చి
క్లైమాక్స్ లో ప్రాణాలొదిలేస్తాడు.
రిమెంబర్ దిస్ యార్
కల్ప్రిట్ కాంట్ బి కానస్టంట్
రేపటి చాన్స్ నీదే కావచ్చు
బీ ! ప్రిపేర్ ఫర్ దట్ పనిష్మెంట్

^ పీనల్ కాలని : నేరస్తులను బంధించే ఒక కాలని
^ హారో : మరణ శిక్షకు వాడే ఒక యంత్రం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి