9, జూన్ 2017, శుక్రవారం

లాంగ్ డ్రైవ్

వీకెండ్ లాంగ్ డ్రైవ్ ఆన్ రింగ్ రోడ్
స్ట్రెస్ నుండి రిలీఫ్ కావాలి బాస్ !!
క్లోజ్డ్ విండ్ షీల్డ్స్ నుండి
వీచే పచ్చటి గాలి
అప్డేట్ ద స్టేటస్ విత్ ఎ సెల్ఫీ
ఫీలింగ్ నోస్టాల్జిక్
లైక్స్ వంద క్రాస్ అవుతాయా !!
చూద్దాం ఈ సారైనా !!
******
రిలాక్స్ , ట్యూన్ టూ ఎఫ్.యం
ఒక పాత పాట
"వేషమ్ము మార్చెను !! భాషను మార్చెను !! మోసం నేర్చెను
అసలు తానే మారెను... అయినా ... "
గుండమ్మ కథ , నో హిరోయిజం బాస్
"అయినా...మనిషి... మారలేదు "
కమాన్ యార్ !! మనిషెక్కడున్నాడు ??
మెషీన్ మేడ్ మ్యాన్ పర్వర్ట్ !!
నిజం.... బిట్టర్ ట్రూత్
గూగుల్ ఫర్ మనిషి
బాబూ !! మని , షీ కాదు ... మనిషి సెర్చ్ ఫర్ ఇట్ !!
చానల్ మార్చరా బాబూ !!
********
పల్లెటూరి పిల్లగాడా.,పసుల కాసే మొనగాడా ...
హ హ హ. మొనగాడు పశువులెందుకు కాస్తాడ్రా పశువా
పాలు మరచి ఎన్నాళ్ళయ్యిందో ఓ పాల బుగ్గల జీతగాడా
జీతగాడికి పాలు తాగే టైమ్ టైముండదు బాస్
అయినా మిల్క్ లో క్యాలరీస్ ఎక్కువ
హ్యావ్ ఎ చిల్డ్ బ్రీజర్ విత్ క్రాన్ బెర్రీ ఫ్లావర్
పాలల్లో ఏదైనా ఫారిన్ ఫ్లావర్ వస్తే బాగుండు
అన్నట్లు ఇది మా భూమి కదా.....
అసలు భూమెక్కడ ఉందిరా ఇడియట్
ఉందంతా ఇండస్ట్రియల్ ఏరియానే కదా !!
చెత్తపాట ..మార్చెయ్యి పాటని
*********
తేరీ మీరీ బీచ్ మే కైసాహై ఏ బంధన్.. అంజానా !!!
ఫీలింగ్ రొమాంటిక్ .... ఈజిట్!! హ హ
కమాన్ !! బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే.
కార్ల్ మార్క్స్ చెప్పిన థియరీ యార్ !!
అసలు ఈ పాట ఎక్కడిదిరా !! ఏక్ దూజే కేలియే !!
ఈజిట్ !! ఒకరికోసం ఒకరేంట్రా !! స్టుపిడ్
అందరూ మనీ కోసం పుట్టార్రా
గో హెడ్ !! ఎర్న్ మోర్ !!
వచ్చే సమ్మర్ వెకేషన్
గ్రాండ్ గా ప్లాన్ చెయ్యాలి
ఈ టైమ్ లో రొమాన్స్ ఏంట్రా నాన్సెన్స్
చేంజ్ ద సాంగ్
********
అప్పుడే రింగ్ రోడ్ అయిపోయిందా
షిట్ యార్ !! ఈ వీకెండ్ కూడా ఎంజాయ్ చెయ్యలేదు
టుమారో, ఈజ్ ద డెడ్ లైన్ ఫర్ ద ప్రాజెక్ట్
వెంటనే ఇంటికెళ్లాలి
దిస్ ఈజ్ రింగ్ రోడ్, దిగకపోతే
ఎక్కడ మొదలుపెట్టామో, అక్కడికే వస్తాం
ఎ బిగ్ జెయింట్ వీల్ బాస్ !!
రిజంబుల్స్ ద బ్లడీ లైఫ్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి