ఒక రాత్రి మోహం చల్లారి
నేను అటు వైపు తిరిగాక.....
అడిగింది ఆమె
“ నువ్వు చిత్రకారుడివి కదా..
నా హృదయం బొమ్మ గీసిస్తావా.. “
బొమ్మ గీసి గర్వంగా చెప్పాను
“నీ హృదయంలో ఉంది నేనే కదా !
అందుకే నా బొమ్మ ...”
ఆమె నవ్వింది,,
“నేనంటే నువ్వేనా... ఇంకేమీ లేదా...
ఇంత చిన్నదా నా హృదయం. !!.”
ఒక్క క్షణం చిత్తరువై నిలుచున్నా
చాలా గీశాను
పిట్టలు..,ఆకాశాలు...
మబ్బులు, డబ్బులు
నక్షత్రాలు... భూగోళాలు..
ఎన్నే, ఎన్నేన్నో
ఆమె నవ్వుతూనే ఉంది
పెద్దగా ఇంకా పెద్దగా
నేనున్న దూరానికి కూడా వినిపిస్తూ
అప్పుడు ఒక అద్దం ఇచ్చి
వెనుతిరిగాను
భళ్ళున శబ్దం
అది అద్దం విరిగిన శబ్దమా !
ఆమె నవ్విన శబ్దమా !!
మరోసారి వెనక్కి తిరగలేను
నేను అటు వైపు తిరిగాక.....
అడిగింది ఆమె
“ నువ్వు చిత్రకారుడివి కదా..
నా హృదయం బొమ్మ గీసిస్తావా.. “
బొమ్మ గీసి గర్వంగా చెప్పాను
“నీ హృదయంలో ఉంది నేనే కదా !
అందుకే నా బొమ్మ ...”
ఆమె నవ్వింది,,
“నేనంటే నువ్వేనా... ఇంకేమీ లేదా...
ఇంత చిన్నదా నా హృదయం. !!.”
ఒక్క క్షణం చిత్తరువై నిలుచున్నా
చాలా గీశాను
పిట్టలు..,ఆకాశాలు...
మబ్బులు, డబ్బులు
నక్షత్రాలు... భూగోళాలు..
ఎన్నే, ఎన్నేన్నో
ఆమె నవ్వుతూనే ఉంది
పెద్దగా ఇంకా పెద్దగా
నేనున్న దూరానికి కూడా వినిపిస్తూ
అప్పుడు ఒక అద్దం ఇచ్చి
వెనుతిరిగాను
భళ్ళున శబ్దం
అది అద్దం విరిగిన శబ్దమా !
ఆమె నవ్విన శబ్దమా !!
మరోసారి వెనక్కి తిరగలేను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి