10, మే 2018, గురువారం

మహానటులు


ఆ కళ్ళల్లో నీళ్లన్నీ ప్రొజెక్టర్ రీళ్లలా తిరుగుతూ
తెరమీద రంగురంగుల దృశ్యాలు ఆవిష్కరిస్తాయి.
కరతాళ ధ్వనులు, ప్రొడ్యూసర్లకు కాసులు కురిపిస్తాయి
ట్రాజెడీ ఏంటంటే బాక్స్ మూతేసి, థియేటర్ మూసేశాక
ఫిల్మ్ రీళ్ళన్నీ చీకట్లో మగ్గాల్సిందే .
రిమెంబర్ యార్ !! ఎ.సి థియేటర్ల చల్లదనం ఆడియన్సు కి మాత్రమే !
విసిరేసిన బాక్సులకు డార్క్ నెస్స్,
 చింపేసిన టిక్కెట్ ముక్కలకు డస్ట్ బిన్నులే ఆవాసాలు.
లుక్ బ్రో ! ఈ మాయాబజార్ సెట్టింగులన్నీ మిమ్మల్ని రంజింపజేయటానికే !
 సెట్ చేసుకోవాల్సిన రియల్ లైఫ్ లో టియర్స్ కి, గ్లిజరిన్ అవసరం లేదు
“మీ కోసమే మే జీవించునది..... “ అంటూ రెండు చుక్కల ఆనందభాష్పాలతో
మీకో తాత్కాలిక దుఃఖపు తెరని అందించి, 
దాని కోసం ఆ దుఃఖాన్ని శాశ్వతత్వం చేసుకున్న జీవితాలు ఉంటాయి బ్రో !      
ఇది ఆడియన్స్, ప్రొడ్యూసర్స్ అడుకొనే క్యాట్ అండ్ మౌస్ గేమ్ భయ్యా !
క్యాట్ కోసం మౌస్, మౌస్ కోసం క్యాట్ చూపించే ఎర మాత్రం యాక్టరే అనేదే ఫాక్ట్ !
ఆ ఎరలకోసం వేసే , ట్రాపు ట్రాపుకు మధ్య ఉన్న గ్యాప్ లో,
లైఫ్ ని న్యాక్ గా నడపటమే అసలైన నటన.
టేక్ మై వర్డ్,  అది తెరమీద కన్పించినంత ఈజీ కాదు
డోంట్ ఫర్గెట్ డియర్ ! స్క్రీన్ మీద కన్పించేది కేవలం టుడీ నే,
 ఎప్పటికీ కన్పించని దర్డ్ డైమన్షన్ లోతులు తెర మీదకు రావు
బట్,  అక్కడ కొన్ని తారలు ఆకాశంలో రాలుతూ ఉంటాయి
అవే నక్షత్రాలని వెలుగుపూలు అని మీరు భ్రమిస్తుంటారు
కానీ అవి కృష్ణబిలాలు, శూన్యం తప్ప ఏమి మిగిల్చుకోలేవు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి