ఇరుగ్గా ఉందంటే ఏమో అనుకున్నా గానీ
మరీ ఊపిరాడనంత ఇరుకు అనుకోలేదు.
పాపం !! పిల్లాడు, కొంచెం పెద్ద అయితే
ఉగ్గుపాలతో పాటు ఆవుపాలు
ఎంత గొప్పవో కూడా తెలుసుకొనుండేవాడు.
కానీ, ఊపిరే తీసుకోలేక ఉసురు తీసుకున్నాడు
ఆక్సిజన్ కోసం సిలిండర్లు, ఆసుపత్రులు
అవసరమే లేదు . గోమలాన్ని తగలడితే చాలు
అనే సైన్సు నేర్చుకోనేవాడు
పిటీ !! చాన్సు మిస్సయ్యాడు
యోగుల మంత్రశక్తి, మంత్రాంగ శక్తి
తెలుసుకున్నాక,
యంత్రాలు, యంత్రాగాలు
కర్మఫల సిద్దాంతాన్నే
దేశంలో వల్లెవేయాలి
జనన మరణాలు చేతుల్లో లేవని
చేతులెత్తేసి, గోమాత పూజ చేయాలి
అయినా
సెకనుకో అరశిశువుని కనేసే దేశంలో
అరవై శిశువులంటే రెండు నిమిషాలే గదా!
కాలచక్రంలో దీని నిడివెంత !!
టేకిట్ ఈజీ !!
నీ ఏడుపు ఆపేసి ,వేదాంత భాష విను సిద్దా !!
నిన్నటి ఇంక్యుబేటర్ల శవాలన్నీ
రేపటి రీఇంకర్నేషన్ లో నేషనలిస్ట్ లు గా పుడతారు.
ఏక్ బార్ జోర్ సే బోల్
“నేషనలిజమ్ ఈజ్ అవర్ ట్రజర్ “
మరీ ఊపిరాడనంత ఇరుకు అనుకోలేదు.
పాపం !! పిల్లాడు, కొంచెం పెద్ద అయితే
ఉగ్గుపాలతో పాటు ఆవుపాలు
ఎంత గొప్పవో కూడా తెలుసుకొనుండేవాడు.
కానీ, ఊపిరే తీసుకోలేక ఉసురు తీసుకున్నాడు
ఆక్సిజన్ కోసం సిలిండర్లు, ఆసుపత్రులు
అవసరమే లేదు . గోమలాన్ని తగలడితే చాలు
అనే సైన్సు నేర్చుకోనేవాడు
పిటీ !! చాన్సు మిస్సయ్యాడు
యోగుల మంత్రశక్తి, మంత్రాంగ శక్తి
తెలుసుకున్నాక,
యంత్రాలు, యంత్రాగాలు
కర్మఫల సిద్దాంతాన్నే
దేశంలో వల్లెవేయాలి
జనన మరణాలు చేతుల్లో లేవని
చేతులెత్తేసి, గోమాత పూజ చేయాలి
అయినా
సెకనుకో అరశిశువుని కనేసే దేశంలో
అరవై శిశువులంటే రెండు నిమిషాలే గదా!
కాలచక్రంలో దీని నిడివెంత !!
టేకిట్ ఈజీ !!
నీ ఏడుపు ఆపేసి ,వేదాంత భాష విను సిద్దా !!
నిన్నటి ఇంక్యుబేటర్ల శవాలన్నీ
రేపటి రీఇంకర్నేషన్ లో నేషనలిస్ట్ లు గా పుడతారు.
ఏక్ బార్ జోర్ సే బోల్
“నేషనలిజమ్ ఈజ్ అవర్ ట్రజర్ “
బాగుంది
రిప్లయితొలగించండి