10, మే 2013, శుక్రవారం

గద్దలొస్తున్నాయి

గద్దలొస్తున్నాయి , పారిపోండి
ఇవి కోళ్ళు తినే గద్దలు కాదు
భూములు తినే గద్దలు
దాచి పెట్టుకోండి
మీ భూములన్నీ
ఏ సెజ్ గంప కిందో,
వీటి చూపు చాలా పెద్దది
ఎక్కడ దాక్కున్నా పట్టేస్తాయి
నీ కడుపు కొట్టేస్తాయి
అందుకే దాపెట్టుకో
సెజ్ కింద కాకపోతే కనీసం
స్మశానం కిందైనా
చచ్చాక కాల్చటం కోసం
మిగులుస్తున్నారు ఊరికి ఉత్తరాన  ఆరడుగులు
అది కూడా నీ మీద ప్రేమ తో కాదు
దెయ్యం అనే భయం తో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి