12, మే 2013, ఆదివారం

మాతృమూర్తి

అమ్మా ! ఈ రోజు మాతృ దినోత్సవం అట
అందరూ జరుపుకుంటున్నారు
నీకు ఒక్క రోజు పండగ
చేస్తే సరిపోతుందా అమ్మా !
నువ్వైపుడైనా పిల్లల దినోత్సవం
జరుపావా అమ్మా, ఒక్క రోజు కి
మాత్రమే ,
ప్రతి రోజు పండగే చేసావు
కదమ్మా, అందరికీ.
కాని, నేనెందుకమ్మా
నిన్ను తలచుకోవటానికి
ఒక్కరోజు మాత్రమే ఖాళీ
ఉంచుకున్నాను.
నా, నువ్విచ్చిన జీవితంలో,
నువ్వు ప్రతి క్షణం
నన్ను తలచుకుంటావని
నాకు తెలియదా ,అయినా
నువ్వు తప్పు చేశావు అమ్మా
నిస్వార్ధం మాత్రమే తెలుసుకున్నావు
నీ స్వార్ధం తెలుసుకోలేకపోయావు
తనయీ తనయులుంటే చాలనుకుని
తనకంటూ ఏమి మిగిల్చుకోని, ఓ మాతృమూర్తి
నీకు ఈ ఒక్క రోజే కాదమ్మా, ప్రతిరోజు
పండగే చెయ్యాలి, కాని ..కాని
నువ్వొప్పుకోవు కదమ్మా, ఇప్పటికీ
నాకే పండగ చేస్తానంటావు, నన్ను
ఋణగ్రస్తుడిని చేస్తావు,
ఈ ఋణం ఎప్పటికమ్మా తీరేది,
దేవుడికి కూడా సమాధానం దొరకని
జవాబు లేని ప్రశ్న ఇది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి