ఎన్ని రోజులో ఎదురు చూసిన ఈ క్షణం
నాకున్న ఏకాంతద్వీపాంతర శిక్ష
ముగిసిన ఈ మధుర క్షణం
మనం కలిసి పాడుకున్న యుగళ గీతం
ఏ రాగంలో అయితేనేం, అమృత గానమే
నీలాకాశపు వెండి పౌర్ణమే
హృదయ పుష్పసరాగమే
నేను కలలు గన్న ఈ క్షణం
నాకు నువ్వు సొంతమైన క్షణం
నా చెంపలు తాకుతూ నీ వేళ్ళ స్పర్శ
ఎప్పుడు ఎరుగని ఈ ఆనందం
నీ నవ్వులో నే చూసిన మెరుపు
ఆ కన్నుల్లో నాపై నీకున్న అనురాగం
ఇది చాలు స్వర్గాన్ని నేను సృష్టించుకోవటానికి
ఆ స్వర్గానికి నిన్ను రాణిని చెయ్యటానికి
నాకున్న ఏకాంతద్వీపాంతర శిక్ష
ముగిసిన ఈ మధుర క్షణం
మనం కలిసి పాడుకున్న యుగళ గీతం
ఏ రాగంలో అయితేనేం, అమృత గానమే
నీలాకాశపు వెండి పౌర్ణమే
హృదయ పుష్పసరాగమే
నేను కలలు గన్న ఈ క్షణం
నాకు నువ్వు సొంతమైన క్షణం
నా చెంపలు తాకుతూ నీ వేళ్ళ స్పర్శ
ఎప్పుడు ఎరుగని ఈ ఆనందం
నీ నవ్వులో నే చూసిన మెరుపు
ఆ కన్నుల్లో నాపై నీకున్న అనురాగం
ఇది చాలు స్వర్గాన్ని నేను సృష్టించుకోవటానికి
ఆ స్వర్గానికి నిన్ను రాణిని చెయ్యటానికి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి