సుస్వర,రాగ తాళాలను సమ్మిళితం చేస్తూ
ఎంత అందమైన పాట పాడుతోందో చూడు ఈ వర్షం
అచ్చు మన ఇరువురిని కలిపి ఒకే
యుగళగీతంలా చేసిన గుండె లయలా
భూమ్యాకాశాలను వాన దారాలతో
కలిపి కుట్టేస్తూ ఎంత అందమైన
దుస్తులు నేస్తుందో చూడు ప్రకృతి
అచ్చు మన ఇద్దరిని వలపు దారాలతో
కలిపి కుట్టిన మనసు దుస్తులమెరుపులా
వంగపువ్వు మొదలు బంతి పువ్వు తుదలు
ఏడుపూల రంగులని కలిపి ప్రకృతి
కట్టిన కొత్త హరివిల్లు చూడు
అచ్చు మన ఇద్దరం జీవితాంతం
కలిసి నడిచే ఏడుజన్మల పొడవైన ఇంద్ర చాపంలా
సమస్త ప్రకృతి మన మధ్య సాంగత్యాన్నే చూస్తుంది
మన మధ్య ఇంకా దూరాన్ని హర్షించలేనంటుంది
నీలో నేను , నాలో నువ్వు
ప్రకృతి లో పురుషుడిలా లీనమవుదాం
మరో సరికొత్త ప్రపంచాన్నే సృష్టిద్దాం
ఎంత అందమైన పాట పాడుతోందో చూడు ఈ వర్షం
అచ్చు మన ఇరువురిని కలిపి ఒకే
యుగళగీతంలా చేసిన గుండె లయలా
భూమ్యాకాశాలను వాన దారాలతో
కలిపి కుట్టేస్తూ ఎంత అందమైన
దుస్తులు నేస్తుందో చూడు ప్రకృతి
అచ్చు మన ఇద్దరిని వలపు దారాలతో
కలిపి కుట్టిన మనసు దుస్తులమెరుపులా
వంగపువ్వు మొదలు బంతి పువ్వు తుదలు
ఏడుపూల రంగులని కలిపి ప్రకృతి
కట్టిన కొత్త హరివిల్లు చూడు
అచ్చు మన ఇద్దరం జీవితాంతం
కలిసి నడిచే ఏడుజన్మల పొడవైన ఇంద్ర చాపంలా
సమస్త ప్రకృతి మన మధ్య సాంగత్యాన్నే చూస్తుంది
మన మధ్య ఇంకా దూరాన్ని హర్షించలేనంటుంది
నీలో నేను , నాలో నువ్వు
ప్రకృతి లో పురుషుడిలా లీనమవుదాం
మరో సరికొత్త ప్రపంచాన్నే సృష్టిద్దాం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి