ప్రియా ఆ రోజు
ఉదయం నీ పెదవులు
నా చెవిలో పలికిన గుసగుసలు
నాకు ప్రతిక్షణం గుర్తున్నాయి ప్రియా.
నా కనులు మూస్తూ చల్లటి నీ చేతులు
నా చెవి దగ్గర తియ్యగా, వెచ్చగా
నీ పెదవుల పలుకులు
ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం.
నువ్వు నీకు, నేను నీకు అని,
నేను ఉన్నంత కాలం
నువ్వు నా కోసమె జీవిస్తానని ,
నేను నీ కౌగిలి లో ఉన్నప్పుడు
ప్రపంచంలో ప్రళయం
కూడా విడదీయలేదని ,.. చెప్పావు
భాద్యతలు మనల్ని కొన్ని రోజులు
దూరం చేసినా, అది భౌతికంగానే కాని
మానసికంగా మనం ఎప్పుడు ఒకరిలో
మరొకరిమే, ఒకరికొకరిమే అనీ... చెప్పావు
అంతకుముందు ఎప్పుడు చూడని
కొత్తలోకాలను చూపానని ,
నీకు ప్రేమ మాధుర్యాన్ని
నేనేతెలిపానని,
నా హృదయ స్పందన
నీ పేరే పిలిచిందని ,
నేను నీకు దూరం అవుతాను
అన్న ఆలోచన మన అలోచన కు
అందనంత దూరాన ఉన్నదని ,
ఇలా......ఎన్నో ఎన్నెన్నో చెప్పావు కదా ప్రియా
నాకు గుర్తు వస్తున్నాయి ప్రియా
ఆ గుసగుసలు ఇప్పుడు స్వరం పెంచి
ఉరుముల్లా వినిపిస్తున్నాయి ప్రియా,
నన్ను నిలవనియ్యనంటున్నాయి
నీ కోసం పరుగిలిడమంటున్నాయి
వస్తున్నా ప్రియా, వస్తున్నా
నీ జ్ఞాపకాల శక్తితో
ఉదయం నీ పెదవులు
నా చెవిలో పలికిన గుసగుసలు
నాకు ప్రతిక్షణం గుర్తున్నాయి ప్రియా.
నా కనులు మూస్తూ చల్లటి నీ చేతులు
నా చెవి దగ్గర తియ్యగా, వెచ్చగా
నీ పెదవుల పలుకులు
ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం.
నువ్వు నీకు, నేను నీకు అని,
నేను ఉన్నంత కాలం
నువ్వు నా కోసమె జీవిస్తానని ,
నేను నీ కౌగిలి లో ఉన్నప్పుడు
ప్రపంచంలో ప్రళయం
కూడా విడదీయలేదని ,.. చెప్పావు
భాద్యతలు మనల్ని కొన్ని రోజులు
దూరం చేసినా, అది భౌతికంగానే కాని
మానసికంగా మనం ఎప్పుడు ఒకరిలో
మరొకరిమే, ఒకరికొకరిమే అనీ... చెప్పావు
అంతకుముందు ఎప్పుడు చూడని
కొత్తలోకాలను చూపానని ,
నీకు ప్రేమ మాధుర్యాన్ని
నేనేతెలిపానని,
నా హృదయ స్పందన
నీ పేరే పిలిచిందని ,
నేను నీకు దూరం అవుతాను
అన్న ఆలోచన మన అలోచన కు
అందనంత దూరాన ఉన్నదని ,
ఇలా......ఎన్నో ఎన్నెన్నో చెప్పావు కదా ప్రియా
నాకు గుర్తు వస్తున్నాయి ప్రియా
ఆ గుసగుసలు ఇప్పుడు స్వరం పెంచి
ఉరుముల్లా వినిపిస్తున్నాయి ప్రియా,
నన్ను నిలవనియ్యనంటున్నాయి
నీ కోసం పరుగిలిడమంటున్నాయి
వస్తున్నా ప్రియా, వస్తున్నా
నీ జ్ఞాపకాల శక్తితో
chala bagundi
రిప్లయితొలగించండి