మా ఊరి చెట్లు
------------మా నాన్న గారి ఉద్యోగ రీత్యా, బదిలీ అయి మా ఊరు "అమ్మనబ్రోలు"
కి వచ్చినప్పుడు నాకు 10 ఏళ్ళు, అదేంటో రైలు దిగగానే నాకు ఊరు భలే
నచ్చేసింది, స్టేషన్ లోనే ఎర్రటి తివాచీ పరిచినట్లు పరుచుకున్న సిర్పేటు
చెట్లు, స్టేషన్ బయట చల్లటి వేప చెట్టు, దాని కింద కిరోసిన్ స్టవ్ కి గాలి
కొడుతూ కాలేషా టీ కొట్టు, దాని వెనకంతా కనుచూపు మేరలో పచ్చటి పచ్చిక,
అప్పుడే వాన పడి వెలిసిందేమో, మరింత పచ్చగా కనిపిస్తుంది, టీ కొట్టు దాటి
కొద్దిగా ముందుకు రాగానే, కుడి వైపు, వరసగా గుర్రబ్బళ్ళు, అప్పటి దాకా
అప్పుడప్పుడు ఎద్దుల బళ్ళు ఎక్కానే తప్ప, గుర్రబ్బండి ఎప్పుడూ ఎక్కక పోవటం
వల్లేమో, అది చూడగానే నాలో ఏదో ఉత్సాహం , గుర్రం కన్నా వేగంగా బండి దగ్గరకు
పరుగు పెట్టించింది, ఊరు అక్కడనుండి దాదాపు 2 మైళ్ళు దూరం, అప్పటికే మా
సామాను అంకమ్మ బండి లో పెట్టించేశాడు, మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి
వచ్చిన లింగారావు మాష్టారు, గుర్రం కదా పరుగెత్తుతుందేమో అనుకున్నా, పాపం
ఒక్కరైతే ఎలా ఉండేదో, ఐదుగురం కదా అది కూడా నడకే ప్రారంభించింది, అలా
అక్కడ్నుండి రోడ్దెక్కామో లేదో, ఎటు చూసినా పచ్చికే, ఎర్రనేల కదా, ఇంకా
పచ్చగా కనిపిస్తుంది, కొద్ది గా ముందుకు రాగానే, ముందుగా యానాది కాలనీ, అది
దాటి కొంచెం ముందుకు రాగానే రైల్వేగేటు, ఏదో గూడ్స్ బండి వస్తున్నట్లుంది,
గేటేశారు. అటు ఇటు మఱి చెట్లు, వాటి కింద బఠానీలు, వేరుశెనగ పప్పులు,
అమ్మే వారు, గంపల్లో తేగలు, మామిడి తాండ్ర, కలిసి కలర్ ఫుల్ గా
కన్పిస్తుంది, గేటు దాటి ముందుకెళ్ళగానే స్కూలు,, అంతకుముందు నేను చదివిన
స్కూలు కన్నా చాలా పెద్దది, పెద్ద ఆటస్థలం, ఉత్సాహంగా రేపటినుండి నేను
వెళ్ళాల్సిన స్కూలు ను చూసుకుంటూ ముందుకెళ్తున్నాను, స్కూలు దాటగానే,
రెసిడెన్షియల్ స్కూలు, ప్రాంగణం అంతా రంగు రంగుల పూల మొక్కలు, అమ్మాయల
రెసిడెన్షియల్ స్కూలు కదా, పూలు బాగా పెంచినట్లున్నారు, పాత ఇనస్పెక్షన్
బంగళాను రెసిడెన్షియల్ స్కూలు గా మార్చారట, పూల తోట మధ్యలో ఠీవిగా
కనిపిస్తుంది, అది దాటి కొద్ది ముందుకు వెళ్ళగానే, హాస్పిటల్. హాస్పిటల్
ముందంతా, అత్తి చెట్లు( మేడి పండు) , వెలక్కాయ చెట్లు, ఆ చెట్లు చూడగానే
వేమన పద్యం గుర్తువచ్చింది "మేడి పండు చూడ మేలిమై ఉండు" , వెలగ చెట్లు
చూడగానే ఏనుగులు గుర్తు వచ్చాయి " కరి మింగిన వెలగ పండు" అంటారు కదా .
ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎడమ వైపు సినిమ హాలు, దాని కెదురుగా మామిడి తోట .
దానిక్కొంచెం ముందు పోలేరమ్మ గుడి, అది దాటగానే చెరువు కట్ట మీదకు వచ్చింది
గుర్రబ్బండి, చెరువ కట్ట ఎక్కగానే చల్లటి గాలి రివ్వున మొహం మీద
కొట్టింది, గట్ట మీదంతా చెట్లే, మర్రి, చింత, రావి, నిద్రగన్నేరు
ఒక్కటేమిటి, ప్రతి పది అడుగులకో చెట్టు. అక్కడ కుడి వైపు తిరిగితే ఊరు,
ఊర్లొ ఒక పది పదిహేను ఇల్లు దాతాకా, ఒక పెంకుటింటి ముందు ఆగింది . పెద్ద
ఇల్లు, ఊరంత పెరడు, ఇంటి ముందు ఒక బొప్పాయి చెట్లు, రెండు కొబ్బరి చెట్లు,
పెరడంతా చెట్ల మయమే, ముందుగా బావి, దాన్నుండి నీరు పోయే ఏర్పాటు, మునగ
చెట్టు, బాదం చెట్టు, అంతకు ముందు ఆ ఇంట్లో ఉన్న వారు పెట్టినట్లున్నారు,
చిక్కుడు పాదు, పోట్లకాయ పాదు, ఇక అమ్మ కూరగాయల కోసం హడావుడి పడనక్కర్లేదు,
పాపం అమ్మకు ఎప్పుడు హాడావుడే, స్కూలు కి పది నిమిషాల ముందే స్కూల్లో
ఉండటం అమ్మా, నాన్న అలవాటు, అదేంటి నాన్న అంటే, మాష్టార్లు ఎప్పుడు ముందు
వెళ్తేనే పిల్లలు వస్తారు అనేవాడు, ఇక ఆ హడవుడి ఉండదు అనుకుంటా అమ్మకు .
ఆ ఇంత్లో ఆ ఊరితో , అ చెట్లతో దాదాపు 10 సంవత్సరాల అనుబంధం , ఏమి
జరిగిందే ఏమో, పంహాయితీ వారికి నిధులు లేవని, చెరువు గట్టు మీద ఉన్న
చెట్లు అమ్మకానికి పెట్టారు, చెట్లు కొట్టేశారు, ఎందుకో ఆ ఊరు అప్పటినుండి
కళావిహీనంగా , బొట్టు కోల్ఫ్యిన విధవ స్త్రీలా కంపిస్తోంది, అదే సమయంలో
మేమున్న ఇళ్ళు వేరే వారికి అమ్మేశారు, మేము ఇళ్ళు ఖాళీ చెయ్యక తప్పలేదు , ,
అ ఇల్లు చెట్లు కూల్చేసి కొత్త డాబా కట్టారు , చెట్లన్నీ మాయం అయ్యాయి ,ఆ
చెట్లతో కూడా ఋణం తీరిపోయిందేమో, ఇక చెట్ల అవసరం రాదు అనుకున్నరెమో
ఇప్పుడు ఊరెల్తాను, స్టేషన్ నుండి ఊరికి దూరం మారలేదు, గుర్రబ్బళ్ళ
స్థానంలో ఆటో లు వచ్చాయి, చెట్ల స్థానంలో మాత్రం ఏమి రాలేదు, అలాగే బోసి
పోయి ఉన్నాయి, బహుశా ఎప్పటికి రావేమో కూడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి